ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా అక్షరాలా... ? హ్యాండ్‌బ్యాగ్స్, నెక్లెస్‌ కంటే కూడా..

First Published | Aug 29, 2023, 5:29 PM IST

సెలబ్రిటీల విషయానికి వస్తే వారు ధరించే  బట్టలు, వాచీలు, నెక్లెస్‌లు, హ్యాండ్‌బ్యాగులు, కార్లు ఇంకా మరెన్నో చాల ఖరీదైనవి. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన లైఫ్  స్థయిల్ అలాగే కాస్ట్లీ వస్తువుల కలెక్షన్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.  
 

Do you know the price of this watch worn by fashion icon Nita Ambani

నీతా అంబానీ భార్యగా, వ్యాపారవేత్తగా, డ్యాన్సర్‌గా, తల్లిగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఆమె ఫ్యాషన్ ఇంకా   ఖరీదైన కలెక్షన్లు ఫ్యాషన్ ప్రియులను కట్టి పడేస్తాయి. వాస్తవానికి  ఆమె  ధరించే దుస్తులు, నెక్లెస్‌లు, ఉపయోగించే హ్యాండ్‌బ్యాగ్‌లు, షూస్‌పై కూడా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం నీతా అంబానీ ధరించిన ఖరీదైన కార్టియర్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
 

నీతా అంబానీ కాస్ట్లీ  వాచ్: నీతా అంబానీ వద్ద ప్రపంచంలోని అనేక ఖరీదైన వస్తువుల కలెక్షన్  ఉంది. అంబానీ కుటుంబానికి చెందిన యాంటిలియా భారతదేశంలోని అత్యంత పాపులర్ అండ్ ఖరీదైన ఇళ్లలో ఒకటి. అలాగే వారు ఉపయోగించే ప్రతి వస్తువు ధర కూడా చెప్పుకునేలా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నీతా అంబానీ  డిఫరెంట్ లుక్‌లో కెమెరా కంటికి చిక్కింది. ఆ సందర్భంగా నీతా అంబానీ నీలిరంగు టాప్ ధరించి బంగారు ఎంబ్రాయిడరీలో MI అని ఉంది. దీనికి తోడు ఆమె  ఉపయోగించిన హ్యాండ్ బ్యాగ్, వాచ్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. 
 


నీతా అంబానీ ధరించిన వాచ్ క్లీ డి కార్టియర్‌కు చెందినదని తేలింది. ఈ వాచ్  18 క్యారెట్ గోల్డ్ అన్‌కట్ డైమండ్ బ్రాస్‌లెట్‌తో కూడిన రోజ్ కలర్ వాచ్. ఈ లగ్జరీ వాచ్‌లో ఫ్లింక్ సన్‌రే ఎఫెక్ట్ డయల్ అండ్ బ్లూ రోమన్ న్యూమరల్ అవర్ మార్కర్‌లు ఉన్నాయి. ఆంతే కాకుండా ఎన్నో ఇతర ఫీచర్లతో కూడిన ఈ వాచ్ ధర అక్షరాలా రూ.25,35,940.
 

సక్సెస్  అంచున ఉన్న నీతా అంబానీ లగ్జరీ లైఫ్  జీవించడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. 1 నవంబర్ 1963న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల ఫోర్బ్స్ లిస్టులో  నీతా అంబానీ పేరు కూడా ఉంది. ప్రఖ్యాత వ్యాపారవేత్తగానే కాకుండా, నీతా తన ముగ్గురు పిల్లలు అనంత్ అంబానీ, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలకు ప్రేమగల తల్లి. అంబానీ కుటుంబానికి పవర్‌హౌస్ అయిన నీతా అంబానీ భారతదేశంలోని నాల్గవ సంపన్న మహిళ. నీతా అంబానీ మొత్తం ఆస్తులు దాదాపు 21,000 కోట్లు. ముఖేష్ అంబానీ  భార్యగా మంచి జీవితాన్ని గడుపుతు తన వైవాహిక జీవితం గురించి చెబుతూ ఉంటారు. జీవితం అంటే ఒకరిని ఒకరు ప్రేమించడం అలాగే కలిసి పనిచేయడం అని అంటుంటారు. 
 

Latest Videos

click me!