మరోవైపు దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీని వెనక ఎంసీఎక్స్ లో పసిడి ఫ్యూచర్లు తగ్గడం ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే కేడియా కమోడిటీస్‌కు చెందిన అజయ్ కేడియా ప్రకారం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుపై పెట్టుబడిదారుల ఆశలు సన్నగిల్లడంతో బంగారం బలమైన డాలర్‌తో పోలిస్తే పడిపోతోందని అంచనా వేశారు. అంతేకాదు ఫెడరల్ రిజర్వ్ తన రాబోయే సమావేశాల్లో వడ్డీ రేట్లను ఎంత పెంచుతుందని పెట్టుబడిదారులు ఊహాగానాలు కొనసాగించడంతో బంగారం, వెండి ధర తగ్గింది.