Jan dhan yojana: ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతా కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పథకం జన్ ధన్ యోజన. కానీ సైబర్ నేరస్తులు దీనిని కూడా వదలలేదు. ఎన్నో రాష్ట్రాలలో జన్ ధన్ ఖాతాల నుంచి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.
మనదేశంలో సుమారు 42 శాతం ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేవి కాదు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి వారికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి కనీసం ఒక బ్యాంకు ఖాతా అయినా ఉండాల్సిందేనని ఈ పథకం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పాటు ప్రతి ఖాతాదారులకు కొన్ని సౌకర్యాలను కూడా అందించారు. రూ. 30,000 జీవిత భీమాను, లక్ష రూపాయల ప్రమాద భీమాను ఇచ్చారు. అలాగే ఖాతాదారుకు 5000 రూపాయల ఓవర్ డ్రాఫ్టును అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్ర ద్వారా ఈ బ్యాంకు సేవలను అందించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు దీనిని కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. జార్ఖండ్, అసోం, తమిళనాడు,మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లోని పేద ప్రజలను మోసం చేసి ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు.
24
ఉద్యోగులుగా చెప్పుకుని
ఎంతోమంది పేదవాళ్లు, రైతులు సైబర్ మోసాలకు గురయ్యారు. తెలియని నెంబర్ నుండి ఫోన్లు చేసి తాము ప్రభుత్వ ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. కొన్ని సూచనలు ఇచ్చి ఫోన్ లో ఆ పనులు చేయమంటారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా నుండి డబ్బులు మాయమైపోతాయి. సైబర్ మోసాలు ఇలాగే కాదు ఎన్నో రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో చోట్ల సైబర్ మోసాలకు గురైనట్టు రైతన్నలు, పేదవారు పోలీసులకు కంప్లైంట్లు ఇస్తున్నారు.
34
వ్యవసాయ శాఖ ఉద్యోగులమని చెప్పి
కొంతమంది వ్యవసాయ శాఖ ఉద్యోగులుగా నటిస్తూ రైతన్నలకు ఫోన్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రయోజనాలు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఇస్తామని హామీ ఇచ్చి వారి దృష్టిని ఆకర్షిస్తున్నారు వారి ఫోన్లకు లింకులు పంపి ఆ లింకును క్లిక్ చేయాలని చెబుతున్నారు. దీంతో ఏమీ తెలియని రైతులు, పేదవారు ఆ లింక్ పై క్లిక్ చేసి సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.
కొన్నిసార్లు ప్రధానమంత్రి ఫోటో ఉన్న ప్రకటనలను తయారు చేసి ఫోన్లకు పంపిస్తా.రు వాటిపై ఐదు వేలు రూపాయలు పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేస్తారు. దానిపై క్లిక్ చేయగానే వినియోగదారులు వేరే వెబ్‌సైట్ కు నావిగేట్ అవుతారు. అక్కడ స్క్రాచ్ చేయమంటూ ఒక కార్డు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన ఏదైనా యూపీఐ యాప్ లకు నావిగేట్ అవుతారు. అప్పుడు 5000 రూపాయలు క్లెయిమ్ చేయడానికి యూపీఐ పిన్ ను నమోదు చేయమని అక్కడ మెసేజ్ వస్తుంది. పిన్ నమోదు చేయగానే ఎకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఇలా ఇప్పటికి ఎంతోమంది మోసపోయారు. రోజురోజుకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
సైబర్ నేరస్థులు సామాజిక లక్ష్యాలను పట్టించుకోరు. డబ్బును నిమిషాల్లో తమ అకౌంట్లోకి తరలించడమే వారి లక్ష్యం. చాలా ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు వాడకుండా నిద్రాణంలో ఉన్నాయి. వాటిని సైబర్ నేరస్థులు యాక్టివేట్ చేస్తున్నారు. ఆ ఖాతాదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను మార్చడం ద్వారా కేవైసీ ని పూర్తి చేసి కొత్త ఏటీఎం కార్డులను తీసుకుంటున్నారు. మరణించిన కస్టమర్ ఖాతాలను కూడా యాక్సెస్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.