Cooler: రిమోట్ కంట్రోల్‌, ట‌చ్ ప్యాన‌ల్‌.. కూల‌ర్‌లో ఏసీలాంటి ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా.!

Published : Apr 11, 2026, 11:14 AM IST

Cooler: వేసవిలో చల్లని గాలి కోసం చాలా మంది ఎయిర్ కూలర్లను ఉపయోగిస్తారు. అయితే సంప్రదాయ నాబ్ కూలర్లతో పోలిస్తే FASTRON స్మార్ట్ ఎయిర్ కూలర్ ఆధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ కూల‌ర్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.? ధ‌ర ఎంత ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
శక్తివంతమైన కూలింగ్ పనితీరు

FASTRON కూలర్‌లో ఉన్న హై ఎయిర్ డెలివరీ సిస్టమ్ గదిలో గాలి వేగంగా ప్రసరిస్తుంది. దీని వల్ల తక్కువ సమయంలోనే గది చల్లబడుతుంది. ఇందులో గరిష్ట గాలి ప్రవాహం 1354 CFM కాగా 3 స్పీడ్ సెట్టింగ్స్‌తో వ‌చ్చింది. ఆటో స్వింగ్ ఫీచర్ వల్ల గాలి అన్ని దిశలలో ప్ర‌స‌రిస్తుంది. ఇవి రూమ్ మొత్తాన్ని సమానంగా చల్లబరుస్తాయి. బెడ్‌రూమ్, హాల్, ఆఫీస్ గదులకు ఇది చాలా అనుకూలం.

25
అడ్వాన్స్‌డ్ ఫౌంటెన్ కూలింగ్ టెక్నాలజీ

ఈ కూలర్‌లో ఉన్న ఫౌంటెన్ వాటర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ప్రత్యేకత. ఈ టెక్నాలజీ వల్ల నీరు కూలింగ్ ప్యాడ్స్‌పై సమానంగా పాకుతుంది. దీనివ‌ల్ల గాలి మరింత చల్లగా మారుతుంది, కూలింగ్ సమానంగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా మెరుగైన పనితీరు చూపిస్తుంది. అదనంగా ఇందులో టాప్ ఐస్ చాంబర్ ఉంది. ఇందులో ఐస్ పెట్టితే గాలి ఇంకా చల్లగా వస్తుంది. 

35
రిమోట్ కంట్రోల్ అండ్ టచ్ ప్యానెల్ సౌకర్యం

సాధారణ కూలర్లలో నాబ్‌లతో మాత్రమే నియంత్రణ ఉంటుంది. కానీ FASTRON స్మార్ట్ కూలర్‌లో రిమోట్ కంట్రోల్‌తో పాటు టచ్ స్క్రీన్ ప్యానెల్ ఉన్నాయి. ఈ ఫీచర్ల వల్ల దూరం నుంచే కూలర్‌ను నియంత్రించవచ్చు. స్పీడ్, స్వింగ్ సులభంగా మార్చుకోవచ్చు. టచ్ ప్యానెల్ ద్వారా వెంటనే సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇది ఆధునిక ఇళ్లకు సరిపోయే స్మార్ట్ డిజైన్‌ను అందిస్తుంది.

45
LED డిస్‌ప్లే అండ్‌ రియల్ టైమ్ టెంప‌రేచ‌ర్ స‌మాచారం

ఈ కూలర్‌లో ఉన్న LED డిస్‌ప్లే గది ఉష్ణోగ్రతను ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీని వల్ల గది ఎంత వేడిగా ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా కూలింగ్‌ను సర్దుబాటు చేయవచ్చు. యూజ‌ర్ల‌కు మరింత సౌకర్యం కలుగుతుంది. నలుపు రంగు గ్లాస్ టచ్ ప్యానెల్ కూలర్‌కు ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది. 

55
తక్కువ విద్యుత్ వినియోగం

FASTRON కూలర్ 100W విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. అందువల్ల విద్యుత్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇందులో 36 లీటర్ల నీటి ట్యాంక్‌ను అందించారు. ఇది ఇన్వర్టర్‌తో కూడా పనిచేస్తుంది. తక్కువ శబ్దంతో ప‌నిచేయ‌డం దీని మ‌రో ప్ర‌త్యేక‌త‌గా చెప్పొచ్చు. ఇది పోర్టబుల్ డిజైన్ కావడంతో గది నుంచి గదికి సులభంగా తరలించవచ్చు. ఇల్లు లేదా ఆఫీస్ రెండింటికీ అనువైనదిగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories