వాహనదారులకు మరో షాక్.. పెట్రోలుతో పాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు భారీగా పెంపు..

First Published Mar 2, 2021, 11:06 AM IST

పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి సిలిండర్  ధరల పెంపు తరువాత వాహనాల్లో ఉపయోగించే సిఎన్‌జి,  గృహావసరాల కోసం వినియోగించే  పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలను కూడా నేడు  పెంచాయి. ఢీల్లీతో సహా ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి ధర కిలోకు 70 పైసలు పెరిగగా  పిఎన్‌జి ధర 91 పైసలు పెరిగింది. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి.
 

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్‌జి, పిఎన్‌జి ధరలను పెంచటంతో దేశ రాజధాని ఢీల్లీలో సిఎన్‌జి కొత్త ధరను కిలోకు రూ .43.40 కు చేరగా నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సిఎన్‌జి ధర కిలోకు రూ .49.08 చేరింది.
undefined
కాన్పూర్, హమీర్‌పూర్, ఫతేనగర్‌లో కిలోకు రూ .60.50. షామ్లీలోని ముజఫర్ నగర్‌లో సిఎన్‌జి ధర కిలోకు రూ .57.25 కు పెరిగింది. రేవారిలో సిఎన్‌జి ధర కిలోకు రూ .54.10 కు పెరగగా కర్నాల్, కైతాల్‌లో రూ .51.38 కు పెరిగింది.
undefined
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి సిఎన్‌జి ఆఫ్ పీక్ అవర్స్‌లో 50 పైసల తగ్గింపుతో లభిస్తుంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంకా అర్థరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు.
undefined
సిఎన్‌జి బంక్ వద్ద క్యాష్ లెస్ పేమెంట్ పై కిలోకు 50 పైసల చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. వంటగ్యాస్ సిలిండర్ల ధరను పెంచిన 24 గంటల్లోనే సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను సవరిస్తూ ఐజీఎల్‌ నిర్ణయం తీసుకుంది.
undefined
undefined
click me!