చైనా కంపెనీ విచిత్ర విధానం.. ఆఫీసులో ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్తే ఏం చేస్తారో తెలుసా ?

First Published May 8, 2021, 12:23 PM IST

మీరు మీ ఆఫీసులో పని చేస్తున్నారని అనుకోండి..  ఈ సమయంలో మీరు టాయిలెట్కు వెళ్ళాలి, కానీ మిమ్మల్ని వెళ్ళకుండా ఆపివేస్తే, మీ పరిస్థితి ఏంటి.. ? వాస్తవానికి, ఒక చైనా కంపెనీ ఇలాంటి విధానాన్ని రూపొందించింది. 

ఒక నివేదిక ద్వారా ఈ సంస్థ ఉద్యోగులను వాష్ రూమ్ కి వెళ్ళడానికి అనుమతిస్తుంది. కానీ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
undefined
దక్షిణ చైనాలో ఉన్న ఈ సంస్థ పేరు అంపు ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ విచిత్ర విధానానికి సంబంధించి ఉద్యోగులు సోమరితనం పోగేట్టేందుకు, పని సామర్థ్యాన్ని మెరుగుపరిచెందుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు టాయిలెట్ బ్రేక్ కి వెళ్తే జరిమానా విధింస్తామని కంపెనీ తెలిపింది. ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ సార్లు టాయిలెట్ బ్రేక్ తీసుకుంటే, అతనికి 20 యువాన్ జరిమానా విధించబడుతుంది.
undefined
గత ఏడాది డిసెంబర్ 20, 21 తేదీల్లో కంపెనీ ఏడుగురు ఉద్యోగులకు జరిమానా విధించింది. వాస్తవానికి, ఈ నిబంధన చార్లీ చాప్లిన్ పాపులర్ మూవీ మోడరన్ టైమ్స్ తో ముడిపడి ఉంది. ఈ చిత్రంలో ఉద్యోగి టాయిలెట్ వెళ్ళే ముందు తన యజమానితో పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేసుకోవాలి.
undefined
అయితే, టాయిలెట్ నిబంధనలను ఉల్లంఘించే జరిమానాలను ఇప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ మొత్తం విషయంపై అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది. సంస్థ తన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని అలాగే జరిమానా విధించిన ఉద్యోగులకు తిరిగి డబ్బు చెల్లించాలని అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
undefined
కంపెనీ మేనేజర్ కావో మాట్లాడుతూ ఉద్యోగులు జరిమానాలు చెల్లించే బదులు, సంస్థ వారి నెలవారీ బోనస్ జరిమానా కట్ చేస్తుందని చెప్పారు. కొంతమంది ఉద్యోగులు తరచూ వాష్ రూమ్ కి వెళ్లి సిగరెట్లు తాగడం, పని సమయంలో బాత్రూమ్ వెళ్ళడం వంటి కారణంగా కంపెనీ ఈ నిబంధనను తీసుకురావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి యాజమాన్యం ఉద్యోగులతో చాలాసార్లు హెచ్చరించింది కాని వారిపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
undefined
click me!