UPI PIN Change ఆధార్ కార్డుతో UPI పిన్.. ఈ విషయం మీకు తెలుసా?

Published : Mar 08, 2025, 08:12 AM IST

మనం ఏదైనా UPI లావాదేవీ చేసేటప్పుడు, నాలుగు లేదా ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయడం తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఈ పిన్ ని జనరేట్ చేయాలంటే ముందు డెబిట్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే దీనికి బదులు ఆధార్ కార్డుతోనూ పిన్ జనరేట్ చేసే సదుపాయం వచ్చేసింది. అదెలాగో తెలుసుకుందాం..

PREV
15
UPI PIN Change  ఆధార్ కార్డుతో UPI పిన్.. ఈ విషయం మీకు తెలుసా?
పిన్ లేకుండా లావాదేవీలు చేయలేం

మనం యూపీఐ ద్వారా ఏ లావాదేవీ జరిపినా  పిన్ నెంబర్ ఎంటర్ చేయడం తప్పనిసరి. మీ ఫోన్ ఎవరైనా తీసుకున్నా, యాప్ ఓపెన్ చేసి లావాదేవీ చేయకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా యూపీఐ పిన్ డెబిట్ కార్డు ద్వారానే సెట్ చేస్తారు.

25
ఆధార్ ఉపయోగించి

మోసాలు జరగకుండా ఉండాలంటే పిన్ నంబర్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంతకుముందు డెబిట్ కార్డు లేకుండా యూపీఐ పిన్ మార్చడం లేదా సెట్ చేయడం కుదిరేది కాదు. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇప్పుడు ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ పిన్ సెట్ చేయడానికి మరో ఆప్షన్ తీసుకొచ్చింది.

35
అత్యధికులను చేరేందుకే..

ఎక్కువ మంది కస్టమర్లకు యూపీఐ పేమెంట్ సిస్టమ్ ద్వారా బెనిఫిట్ కలిగించాలనే ఈ పద్ధతిని తీసుకొచ్చారు. కానీ ఈ ప్రాసెస్ కోసం కస్టమర్ మొబైల్ నంబర్ ఆధార్, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉండాలి. అలా అయితే ఎవరైనా ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. అప్పుడే డెబిట్ కార్డు లేకుండా యూపీఐ పిన్ సెట్ చేయడం లేదా మార్చడం సాధ్యమవుతుంది. కానీ ఎలా చేయాలి?

45
ఈ పద్ధతి ప్రకారం చేయండి

ముందుగా యూపీఐ యాప్ ఓపెన్ చేయాలి. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ కోసం యూపీఐ పిన్ సెట్ చేసే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి డెబిట్ కార్డు ఉపయోగించడం, రెండోది ఆధార్ ఓటీపీ ఉపయోగించడం. ఆధార్ ఓటీపీ ఉపయోగించి యూపీఐ పిన్ సెట్ చేసే ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత అలోవ్ చేయండి, ఆధార్ నంబర్‌లోని మొదటి 6 అంకెలు రాయండి.

55
ప్రాసెస్ పూర్తి

ఇది అయిపోయాక వివరాలన్నీ సరిచూసుకోండి. ఆ తర్వాత బ్యాంక్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రాసి వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ అయ్యాక మీరు కొత్త యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. కొత్త పిన్ ఎంటర్ చేసి అప్లికేషన్‌లో లాగిన్ అయ్యాక మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి సబ్మిట్ చేయాలి.

click me!

Recommended Stories