Business Ideas: సీజన్‌తో సంబంధం లేని ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించుకునే చాన్స్..

First Published Jan 3, 2023, 4:38 PM IST

వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుబడి కోసం వెతుకుతున్నారా,  అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాల ద్వారా కొత్త వ్యాపారులకు పది వేల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తోంది రుణాలు పొందిన యువత వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తున్నారు.  ప్రస్తుతం ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.

సీజన్ తో సంబంధం లేని వ్యాపారం చేయడం ద్వారా,  మీరు ప్రతి సారి చక్కటి ఆదాయం పొందే వీలుంది.  ఫుడ్ బిజినెస్ అనేది  మీకు చాలా సహాయపడుతుంది.  అయితే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా,  చికెన్ పకోడీ సెంటర్ ఓ చక్కటి అవకాశం ఉంది.  నగరాలు పట్టణాల్లో సాయంకాలం వేళ వేడివేడిగా తినేందుకు స్నాక్స్ కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసమే మీరు వేడి వేడి చికెన్ పకోడీ అందిస్తే లొట్టలు వేసుకొని తినేస్తారు.

మీరు చికెన్ పకోడీ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకుంటే,  మీరు ఎంపిక చేసుకునే స్థలం చాలా ముఖ్యమైన విషయం అవుతుంది.  ఎందుకంటే సెంటర్ ను బట్టే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.  ఎక్కువగా జన సమ్మర్థత ఉండే ప్రదేశాలు  ఆఫీసులు స్కూళ్లు కాలేజీలు,  మార్కెట్ ప్రదేశాలు బస్టాండ్ రైల్వేస్టేషన్  సమీపంలో మీ చికెన్ పకోడీ సెంటర్ పెట్టుకుంటే చక్కటి లాభాలు పొందే వీలుంది.
 

ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవాలి.  లేదా ఒక షాపు రెంటుకు తీసుకోవాలి.  నాన్ వెజ్ పకోడీలను తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు.  ఎందుకంటే నాన్ వెజ్ పకోడీ ఎక్కువగా లభించదు.  కానీ అందుబాటులో ఉంచితే మాత్రం లొట్టలేసుకుంటూ తినేస్తారు.  ఒకవేళ మీకు పకోడీలు చేయడం రాకపోతే,  అనుభవం ఉన్న వారి వద్ద కొద్ది కాలం నేర్చుకుంటే మంచిది.  పనివాళ్లను పెట్టుకొని ప్రారంభిస్తే, వాళ్ళు పని ఉన్నరోజున రాకపోతే  మీ వ్యాపారం మూతపడుతుంది.  మీకు పూర్తిగా ఆ పని మీద  అవగాహన ఉంటేనే  మీరు ఆ వ్యాపారంలో రాణించగలరు. 
 

ఈ వ్యాపారం పెట్టుబడికి నీకు కనీసం 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. షాపు ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి.  అలాగే కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ పొందాలి.  దాంతోపాటు అద్దె అడ్వాన్సు  ఇందులో అదనంగా ఉంటాయి. ఇక మీరు స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం, స్థానిక మున్సిపాలిటీ నుంచి స్ట్రీట్ వెండర్  పర్మిషన్ తీసుకోవాలి. 
 

ఇక ఈ వ్యాపారంలో రాణించాలంటే మాత్రం రుచి నాణ్యత చాలా ముఖ్యమైనవి.  చికెన్ పకోడీతో పాటు,  మటన్ ఫ్రై, ఫిష్ కట్లెట్,  రొయ్యల వేపుడు,  కౌజు పిట్ట వేపుడు,  ఇలాంటి వెరైటీ రుచులను కూడా అందుబాటులో ఉంచాలి. అప్పుడే మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది.  దాంతోపాటు  చికెన్ మటన్ వంటి పదార్థాలను తాజాగా ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి.  నిల్వ పదార్థాలతో పకోడీ చేస్తే  అది రుచి కోల్పోతుంది.  నాణ్యత లోపిస్తుంది. కస్టమర్ల ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కస్టమర్ల ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం,  మరోసారి మీ వద్దకు రారు.  మౌత్ పబ్లిసిటీ ని మించిన పబ్లిసిటీ మరొకటి లేదు.  కావున మీ ఉత్పత్తి గురించి నలుగురు మంచిగా చెప్పుకునేలా ప్రయత్నించండి. 
.   
 

నోట్:  పైన పేర్కొన్నటువంటి బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏషియానెట్ తెలుగు ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వదు. పైన పేర్కొన్నటువంటి ఆదాయాలు అంచనాలు మాత్రమే.  మీరు తీసుకునే నిర్ణయాలకు మీరే బాధ్యులు. 
 

click me!