Business Ideas: ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఉన్న ఊరిలోనే, ఏటా లక్షల్లో ఆదాయం తెచ్చే వ్యాపారం ఇదే..

First Published Dec 9, 2022, 5:29 PM IST

వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా, ఉద్యోగం  కన్నా మీ వ్యాపారమే లైఫ్ లో సెటిల్ అయ్యే అందుకు మార్గం అని భావిస్తున్నారా. అయితే మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే,  కానీ ఏ వ్యాపారం చేయాలనే కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం, మీ ముందు అనేక బిజినెస్ ఐడియాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఉన్న ఊరిలోనే నివసిస్తూ,  కాస్త స్థలం ఉంటే చాలు అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు.  అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం.

కోళ్ల ఫారం అనగానే అందరికీ గుర్తొచ్చేది,  పెద్ద పెద్ద  గోడౌన్స్, రేకులు వేసి పెద్ద పెద్ద షెడ్డులను నిర్మించాలి. కానీ  నాటు కోళ్ల పెంపకానికి,  అంత పెద్ద షెడ్డులు అవసరం లేదు,  ఓపెన్ ప్లేస్ లో కూడా నాటు కోళ్లను ఏమాత్రం ఖర్చు లేకుండా పెంచవచ్చు.  సహజంగా పెరిగే నాటు కోళ్లకు  మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటి రుచి కూడా బాగుంటుందని పేరుంది. 

 ఒకవేళ మీ వద్ద పండ్లతోటలు,  లేదా ఒక అర ఎకరం ఖాళీ స్థలం ఉంటే,  ఈ నాటు కోళ్ల పెంపకం సులభంగా చేపట్టవచ్చు.  తద్వారా మీరు మంచి ఆదాయం పొందే వీలుంది.  ముందుగా మీరు రైతుల వద్ద నుంచి నాటు కోడి గుడ్లను సేకరించాల్సి ఉంటుంది.  సేకరించిన గుడ్లను ఇంకుబేటర్ లో పెట్టి పిల్లలను తయారు చేసుకోవచ్చు. నాటు కోడి పిల్లలను ఆరుబయట వాతావరణంలోనే పెంచుకోవచ్చు. శుభ్రమైన దాణా, మంచినీళ్లను  అందుబాటులో ఉంచితే చాలు అవి చాలా బాగా పెరుగుతాయి. 

కోడి పిల్లలు పెరిగిన తరువాత వాటి కోడి గుడ్లను సేకరించాలి. మళ్లీ వాటిని ఇంక్యుబేటర్లలో  పొదిగి పిల్లలను పెంచాలి. 20 వారాల తర్వాత కోళ్లు దాదాపు ఒక కేజీ వరకు బరువు పెరుగుతాయి. అప్పటి నుంచి వీటిని అమ్ముకోవచ్చు.  ఇక నాటు కోళ్ల కు పెద్దగా వ్యాక్సిన్లు మందులు అవసరం లేదు.  ఇవి సహజంగానే పెరుగుతాయి.  వీటి దాణాకు కూడా పెద్దగా ఖర్చు అవ్వదు.  సహజంగా లభించే పదార్థాలతోనే దాణా తయారు చేసుకోవచ్చు.

నాటు కోళ్ల కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.  వీటి ధర బాయిలర్ కోళ్ల కన్నా ఎక్కువ.  ముఖ్యంగా బోనాల జాతర సీజన్లో వీటి డిమాండ్ చాలా ఎక్కువ.  అలాగే దసరా,  సంక్రాంతి సమయాల్లో నాటు కోళ్లను తినేందుకు ఎక్కువగా జనం ఆసక్తి చూపిస్తారు. మీరు  మంచి ఆదాయం నేరుగా మార్కెట్లో నాటు కోళ్లను విక్రయిస్తే మీరే ఎక్కువ లాభం పొందే  వీలుంది.  మీకు ఎక్కువగా స్థలం లేకపోతే ఇంటి వెనక పెరట్లో కూడా నాటు కోళ్లను పెంచుకోవచ్చు. ఆరు బయట తిరిగిన నాటు కోళ్లు సాయంకాలం షెడ్డులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

అయితే అదనపు ఆదాయం కోరుకునే వాళ్లకు ఇలా ఆరు బయట పద్ధతిలో కోళ్లను పెంచడం చక్కటి అవకాశం. పెద్ద పెద్ద కోళ్ల ఫారం లు ఏర్పాటు చేసుకోవడం కన్నా ఇలా చిన్నగా నాటు కోళ్లు పెంచుకుంటే, పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ అవుతుంది.

click me!