Business Ideas: కేవలం రూ. 2500లతో ఈ కోర్సు నేర్చుకుంటే చాలు ఉన్న ఊరిలో నెలకు రూ. 50 వేలు సంపాదించుకున చాన్స్..

First Published | Aug 18, 2023, 3:56 PM IST

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే సరైన ఉద్యోగం లభించక సతమతం అవుతున్నారా ముఖ్యంగా చదువుకున్న యువత ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులను నేర్చుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ వృత్తి విద్యా కోర్సు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. 

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ లు ప్రతి ఒక్కరి చేతిలోనూ కనిపిస్తున్నాయి.  మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లు రిపేర్ చేసే వారి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతోంది.  ముఖ్యంగా వర్షాకాలంలో స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా పాడవతూ ఉంటాయి. అలాంటి సమయంలో స్మార్ట్ ఫోన్ రిపేర్ చేసే వారి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ప్రతినిలా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.

అయితే ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సు ఎక్కడ నేర్చుకోవాలో తెలియక సతమతం అవుతున్నారా..? ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థలో మొబైల్ సర్వీసింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా, మీరు ఈ రంగంలో చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  మొబైల్ సర్వీసింగ్ కోర్స్ కోసం మీరు  రూ. 2500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలల వ్యవధి ఉండే ఈ కోర్సులో మీకు మొబైల్ రిపేరింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు.  అంతే కాదు ఈ కోర్సు అనంతరం మీకు సర్టిఫికెట్ ప్రధానం కూడా చేస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు సొంతంగా మొబైల్ రిపేరింగ్ షాపు పెట్టుకోవచ్చు. 


మొబైల్ రిపేరింగ్ షాప్ ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు మొబైల్ రిపేరింగ్  ఆన్ లైన్ సర్వీస్ కూడా మీరు అందించవచ్చు.  తద్వారా మీరు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.  అంతేకాదు మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు ప్రస్తుతం భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నటువంటి పలు మొబైల్ తయారీ సంస్థల్లో ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. 

మీరు కనుక మొబైల్ రిపేరింగ్ షాపు ప్రారంభించాలి అనుకున్నట్లయితే, కనీస పెట్టుబడి 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు పెట్టవచ్చు. జన సమర్థం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ షాపు పెట్టుకోవడం ద్వారా మీకు ఫలితం లభిస్తుంది. అంతేకాదు మొబైల్స్ విక్రయించేందుకు డీలర్ షిప్ కూడా తీసుకుంటే మీకు అదనంగా ఆదాయం లభిస్తుంది. 
 

సెట్విన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్పొరేషన్ సంస్థ,  హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పలు వృత్తి విద్య కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. అతి తక్కువ ధరకే మీరు సర్టిఫైడ్ కోర్సులను నేర్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ సందర్శించవచ్చు. 
 

Latest Videos

click me!