ప్రస్తుత కాలంలో కోడిగుడ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కోవిడ్ దశలో ఎక్కువగా డాక్టర్లు సైతం కోడిగుడ్లనే తినాలని సిఫార్సు చేశారు. కోడిగుడ్లలో ఉండే పోషక పదార్థాల వల్ల ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సంపూర్ణ పౌష్టికాహారానికి ఉడకబెట్టిన కోడిగుడ్డు చాలా అవసరం అని సూచిస్తున్నారు.
Image: Freepik
అయితే కోడిగుడ్ల వ్యాపారం చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా కోడిగుడ్ల డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం సంపాదించవచ్చు. మీరు ఎలాంటి పౌల్ట్రీ ఫారం లేకుండానే ఈ కోడిగుడ్ల డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేయవచ్చు. ముఖ్యంగా కోడిగుడ్ల వ్యాపారం కోసం మీరు డీలర్ షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి పాలు పౌల్ట్రీ యాజమాన్య సంస్థలు, కోడిగుడ్ల డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ అందిస్తున్నాయి.
మీరు ఈ డీలర్షిప్ పొందాలి అనుకుంటే, ఆయా పౌల్ట్రీ సంస్థల అధికారిక వెబ్ సైట్ వెళ్లి సంప్రదించవచ్చు. డీలర్ షిప్ పొందిన అనంతరం, మీరు కోడిగుడ్ల వ్యాపారం కోసం ఒక దుకాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది. . అందులో కోడిగుడ్లను భద్రపరుచుకోవచ్చు. దాంతోపాటు ఒక కమర్షియల్ ట్రక్ కూడా కొనుగోలు చేస్తే మంచిది. లేదా మీరు ఆ కమర్షియల్ ట్రక్ ను అద్దెకు తీసుకొని నడపడం ద్వారా కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు.
ఇంకా మీ ప్రాంతంలోని మీ చుట్టుపక్కల పరిసరాల్లో కోడిగుడ్ల డిమాండ్ ఎక్కడ ఉందో తెలుసుకుని బల్క్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మార్కెట్ ధరను బట్టి మీకు కోడిగుడ్డుపై లాభం లభిస్తుంది. కమిషన్ ప్రాతిపదికన కంపెనీ మీకు లాభం అందిస్తుంది. సాధారణంగా కిరాణా షాపులు, చికెన్ షాపులు, కర్రీ పాయింట్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హాస్టల్స్ వంటి డిమాండ్ ఉన్నటు కేంద్రాలకు కోడిగుడ్లను సప్లై చేస్తే మంచిది తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఇంకా డీలర్ షిప్ పొందాలంటే కనీస పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే రెండు లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఈ వ్యాపారంలో చక్కటి అవకాశాలు పొందే వీలుంది. కనీసం రోజుకు మూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. తద్వారా నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే వీలుంది.
అంతేకాదు కోడిగుడ్ల డీలర్ షిప్ నిత్యం డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ దీనికి డిమాండ్ తగ్గదు అన్న విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లు నిత్యవసర వస్తువుగా జనం పరిగణిస్తూ ఉంటారు పాలతో పాటు కోడిగుడ్లను కూడా ప్రతిరోజు తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది