దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము టపాసులు కాల్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు సంపన్నులు అయితే లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు వ్యాపార అవకాశంగా మార్చుకున్న వీలుంది ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు దీపావళి కోసం టపాసులు విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా మీ సమీపంలోని ఫైర్ డిపార్ట్మెంట్ వారి వద్ద నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అంతేకాదు. స్థానిక పోలీస్ స్టేషన్ వారి వద్ద కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి పొందిన తర్వాత ఒక జనావాసానికి దూరంగా ఒక ఖాళీ స్థలంలో మీరు తాత్కాలికంగా టపాసుల దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం అగ్నిమాపక యంత్రాలను సమీపంలో ఉంచుకుంటే మంచిది.
ఇక ఆ తర్వాత మీరు అది తక్కువ ధరకే మందు గుండు టపాసులను తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం తమిళనాడులోని శివకాశి ప్రాంతానికి వెళ్తే మంచిది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద మందు తయారీ సంస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలోనే టపాసులు పెద్ద ఎత్తున తయారుచేస్తారు మీరు సీజన్ ప్రారంభం కాకముందే టపాసులు తెచ్చుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు టపాసులు తెచ్చుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా వాటిని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకున్న ఆ తర్వాత మీరు దీపావళి సీజన్ ప్రారంభం నుంచి కార్తీక పౌర్ణమి వరకు వీటిని మీరు విక్రయించవచ్చు.
మీరు టపాసులను విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఎందుకంటే టపాసులపై ఉన్న లాభం మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ లాభం మార్జిన్ దాదాపు 50 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. దీపావళి రోజు పటాకులకు మరింత డిమాండ్ ఉంటుంది కావున ఈ వ్యాపారంలో చక్కటి ఆదాయం ఉండే అవకాశం ఉంది.
అయితే మీ మార్కెట్ రేంజ్ ను బట్టి మీరు సరుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే సరుకు ఎక్కువగా తెచ్చుకున్న అమ్ముడు అవుతుంది. కానీ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా మందు గుండూ సామగ్రి తెచ్చుకున్నట్లయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల సరుకు తెచ్చుకొని విక్రయించినట్లయితే దాదాపు 3 లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.