Business Ideas: జస్ట్ రూ.50 వేలతో ఈ చిన్న బిజినెస్ చేస్తే రోజుకు రూ. 5 వేలు మీ సొంతం అయ్యే అవకాశం..

First Published May 14, 2023, 7:16 PM IST

యువతి యువకులు వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అంతేకాదు సీజన్ ప్రకారంగా చేసే ఈ బిజినెస్ లో ప్రతి సీజన్లోనూ మంచి ఆదాయం పొందవచ్చు.  ఇప్పుడు ఈ వినూత్నమైన బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. 

టీ, కాఫీ షాప్స్ గురించి మనందరం వినే ఉంటాము. ఇందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటున్నారా.  అయితే మీరు తప్పులో కాలేసినట్లే.  నిజానికి టీ స్టాల్ లేదా కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. కానీ మీరు వినూత్నంగా ఈ బిజినెస్ చేసినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఓ చక్కటి ప్లాను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

టీ స్టాల్ అనగానే మనందరం గుర్తొచ్చేది కేవలం కాఫీ టీ మాత్రమే కానీ ఇలా కాకుండా ఇతర పానీయాలను కూడా అందుబాటులో ఉంచడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది ఉదాహరణకు వేసవికాలంలో లస్సి బటర్ మిల్క్ వంటివి అందుబాటులో ఉంచడం ద్వారా మీ ఆదాయానికి అదనపు ఆదాయం తోడు అవుతుంది.  ముఖ్యంగా వేసవికాలంలో లస్సి చాలా మంచి డిమాండ్ అందుకుంటుంది ఈ లస్సి తయారు చేయడానికి మార్కెట్లో ఇన్స్టంట్ మెషిన్లు కూడా లభిస్తున్నాయి ఇందులో కేవలం పెరుగు, పంచదార వేస్తే చాలు  చల్లటి లస్సీ సిద్ధం అవుతుంది. 

ఒక గ్లాసు లస్సీ ధర 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెట్టవచ్చు.  లస్సిలో ఐస్ కలిపే బదులు,  ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పెరుగుతోనే లస్సీ తయారు చేస్తే చల్లటి పానీయం మీ సొంతం అవుతుంది.  అయితే నిజానికి కేవలం లసి షాపు పెట్టుకోవడం ద్వారా ఆదాయం అంతగా రాకపోవచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో లస్సీ తాగే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.  అదే పంజాబ్ కానీ హర్యానా ఇతర ఉత్తర భారత దేశంలో లస్సీని టీ కాఫీలతో సమానంగా తాగుతారు కానీ మన తెలుగు రాష్ట్ర ప్రజల్లో లస్సీ తాగే అలవాటు లేదు.  అందుకే మీరు టీ స్టాల్ తో పాటుగా లస్సీ పార్లర్ కూడా అందుబాటులో ఉంచుకున్నట్లయితే చక్కటి అదనపు ఆదాయం పొందే వీరుంది.
 

 నిజానికి లస్సి మేకింగ్ మిషన్ ధర 25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంది.  ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లో ద్వారా మీరు ఈ మెషిన్లు కొనుగోలు చేయవచ్చు.  సీజన్లో లసి విక్రయించడం ద్వారా ఒక రోజుకు ఐదువేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు సంపాదించవచ్చు.  ఇక చివరిగా నెలకు కనీసం 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే వీలుంది ఖర్చులు పోయిన కనీసం 50,000 వరకు మిగిలే అవకాశం ఉంది. 
 

click me!