Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండా విదేశాల్లో సైతం చేయగలిగే బిజినెస్ ఇదే..నెలకు వేల డాలర్లలో ఆదాయం..

First Published May 12, 2023, 2:12 AM IST

మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా… ఇంటి వద్ద ఉండి కూడా చక్కటి వ్యాపారం చేసుకునే వీలుంది. అలాంటి చక్కటి వ్యాపారం ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండే,  ఎలాంటి పెట్టుబడి లేకుండా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  

ఈ మధ్యకాలంలో హస్తకళలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా చేతితో చేసే హస్త కళలకు ప్రపంచ మార్కెట్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే చైనా లాంటి దేశాలు తమ సాంప్రదాయ హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేసి కోట్లల్లో ఆదాయాన్ని పొందుతున్నాయి. మన భారతదేశం కూడా హస్తకళలకు పుట్టినిల్లు. అందుకే మన దేశంలోని హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే వీలుంది. మరి హస్తకళలకు సంబంధించిన ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సాధారణంగా వేసవికాలంలో కుండలో నీళ్లు తాగటం అనేది ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు.  ముఖ్యంగా మట్టి కుండలు మంచినీళ్లు చల్లగా ఉంటాయి. ఫ్రిజ్ నీటి కన్నా కూడా కుండనీరు ఆరోగ్యానికి మంచిదని పూర్వీకులు చెబుతున్నారు. మరి ఈ కుండల వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.  అయితే కుండల వ్యాపారంలో  లాభం ఏముందని మీకు ఆలోచన రావడం సహజమే.  కానీ కొద్దిగా కళాత్మకంగా ఆలోచిస్తే మీకు ఇందులో చక్కటి వ్యాపారం కనిపిస్తుంది. 

కుండలపై పెయింటింగ్స్ వేయడం ద్వారా దాని విలువ రెట్టింపు అవుతుంది. అనడంలో ఎలాంటి సందేహము లేదు. చక్కటి పెయింటింగ్స్ వేసి కుండలను విక్రయిస్తే, వాటి ధర అమూల్యమవుతుందని చెప్పాలి.  చైనా దేశంలో కుండలపై పెయింటింగ్ వేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తూ ఉంటారు. తద్వారా వాళ్లు కోటానుకోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.  అయితే మీరు కూడా హస్త కళల ద్వారా మంచి ఆదాయం పొందాలనుకుంటే ఓ ప్రణాళిక ప్రకారం ఈ వ్యాపారం చేయాల్సి ఉంటుంది.

ముందుగా పెద్ద మొత్తంలో కుండలను ఖరీదు చేయాల్సి ఉంటుంది.  అనంతరం వాటిని కళాత్మకంగా మార్చేందుకు, మీరు కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ డిజైన్స్ ను  కుండలపై రంగులతో వేయడం ద్వారా చక్కటి ఆకృతిని పొందవచ్చు.  అలాగే కుండలపై డిజైన్స్ తో పాటు మీరు కొన్ని కళాత్మక రూపాలు అయినటువంటి బొమ్మలు వంటివి రూపొందించవచ్చు. అలాగే అద్దాలు మెరుపులు, ముత్యాలు, బీడ్స్ , కుందన్స్ వంటివి అతికించి కూడా కుండలను మరింత ఆకర్షణీయంగా చేసి కళాత్మక రూపాలుగా మార్చవచ్చు. 

ఈ కళాత్మక కుండలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేసి కూడా విక్రయించవచ్చు.  అలాగే ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్ లలో కూడా వీటిని అందుబాటులో పెట్టడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది.  దీంతో పాటు ఆన్లైన్లో విక్రయించడం ద్వారా అమెరికా, యూరప్ వంటి దేశాల నుంచి ఆర్డర్లను సైతం పొందే వీలుంది. 

click me!