Business Ideas: కొత్త సంవత్సరం కోటీశ్వరుడు అవ్వాలని ఉందా, అయితే ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 10 లక్షలు మీవే..

Published : Jan 01, 2023, 01:17 PM IST

కొత్త సంవత్సరం కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారా, అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే వ్యాపారం ప్రారంభించి, చక్కటి లాభాలను పొందే వీలుంది. అయితే ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా, అయితే కొత్త ఏడాది ఓ చక్కటి వ్యాపార ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీకు చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి ఫుడ్ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ఈ బిజినెస్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.   

PREV
16
Business Ideas: కొత్త సంవత్సరం కోటీశ్వరుడు అవ్వాలని ఉందా, అయితే ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 10 లక్షలు మీవే..

బిర్యానీ అనేది  పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వంటకం.  వెజ్ నాన్ వెజ్ బిర్యానీ తిని ఎందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు.  ముఖ్యంగా చికెన్ బిర్యాని తినేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.  ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని సమయాల్లోనూ అమ్ముడు పోయే ఏకైక వంటకం బిర్యానీ. అర్ధరాత్రి పూట కూడా బిర్యానీ తినేందుకు యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మంచి టేస్ట్ ఈ నాణ్యత ఉన్న బిర్యాని కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.  దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు. 
 

26
Hyderabad Dum Biriani

అయితే బిర్యానీకి ఒక మంచి బ్రాండ్ అవసరం, అప్పుడే మీ బ్రాండ్ బిర్యానీ మార్కెట్లో బాగా సేల్ అవుతుంది. ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం ద్వారా, మీ వ్యాపారం నాలుగు దిక్కులా డెవలప్ అవుతుంది. అప్పుడు మీ ఆదాయం చాలా పెరిగే అవకాశం ఉంది. బిర్యానీ బ్రాండ్ ద్వారా మీ వ్యాపారాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.  అయితే ఒక బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే,  ఎల్లవేళలా ఒకే రకమైన టేస్ట్,  నాణ్యత మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కేఎఫ్సి తరహాలో మీరు ఒక బిర్యానీ బ్రాండ్ ను సృష్టించగలిగితే,  త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ మోడల్ అనేది, ప్రస్తుతం చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  మీతో పాటు మరో నలుగురిని  మీ బ్రాండ్ ద్వారా ముందుకు నడిపించవచ్చు. 

36

ఒక బిర్యానీ బ్రాండ్ తయారు చేయాలంటే,  ఏం చేయాలో తెలుసుకుందాం.  ముందుగా మీ బ్రాండుకు ఒక చక్కటి పేరును నిర్ణయించుకోవాలి. ఒక యూనిక్ పేరును మీ బ్రాండ్ నేమ్ గా పెట్టుకోవాలి.  అందరికీ సులభంగా నోట్ అయ్యేలా మీ బ్రాండ్ నేమ్ పెట్టుకోవాలి.  అప్పుడే మార్కెట్లో సక్సెస్ అవుతారు.  అదేవిధంగా మీ బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయించుకోవాలి. లోగో సైతం ట్రేడ్మార్క్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.  ఇక బిర్యానీ తయారీ కోసం మీరు ప్రత్యేకంగా మసాలా తయారు చేయించుకోవాలి.  బిర్యానీ తయారీ కి ఒకే రకమైన విధానం,  నాణ్యత మెయిన్ టెయిన్ చేయాలి. అప్పుడే బిర్యానీ రుచి ఒకేలా ఉంటుంది. 
 

46

అన్ని చోట్లా ఔట్ లెట్ డిజైన్ కూడా ఒకేలా మెయిన్ టెయిన్ చేయాలి. మొదట్లో కేవలం టేక్ అవే పెట్టుకోవాలి. ఎందుకంటే రెస్టారెంట్ అన్నది ఖర్చుతో కూడుకున్న పని.  లేదా సెల్ఫ్ సర్వీస్ ద్వారా బిర్యాని తినేలా కొన్ని చైర్స్ మెయింటైన్ చేయాలి.  ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ మెయింటైన్ చేస్తూ.  నగరంలోని వివిధ ప్రాంతాల్లో outlets పెట్టి అక్కడ బిర్యానీని అక్కడ వేడివేడిగా అందుబాటులో ఉంచాలి. బిర్యానీని ఔట్ లెట్స్ కు చేరసేందుకు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలి. 
 

56
Image Credit: Getty Images

ఇక ప్రమోషన్, మార్కెటింగ్ అనేది బ్రాండ్ ప్రమోషన్ కు చాలా ముఖ్యమైనది.  మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్లాలంటే  ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం.  డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ బ్రాండ్ను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లవచ్చు.  ఈ మధ్యకాలంలో కంట్రీ డిలైట్ యాప్  ఓ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఈ బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా రీచ్ అయ్యింది. 
 

66
BIRYANI

మీ వ్యాపారం పెరిగేకొద్దీ  అవుట్ లెట్స్ సంఖ్య పెంచుకోవాలి.  అప్పుడే మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  సెంట్రలైజ్డ్ కిచెన్ కాన్సెప్ట్ ద్వారా మీరు ఒకే దగ్గర ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఖర్చు కలిసి వస్తుంది. అలాగే సరుకులు, ఇంధనం, ఒకే దగ్గర స్టోర్ చేసుకునే వీలు ఉంటుంది. ఈ విధంగా కాస్త పెట్టుబడి ఎక్కువైనప్పటికీ బిజినెస్ ప్లాన్ చేసుకుంటే కోట్ల ఆదాయం పొందే వీలుంది. 

Read more Photos on
click me!

Recommended Stories