పెట్రోల్‌, డీజిల్‌ ఒక రూపాయి తక్కువకే.. నయారా ఎనర్జీ గుడ్ న్యూస్

First Published | May 30, 2023, 3:27 PM IST

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ కంపెనీ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలపై వినియోగదారులకు శుభవార్త చెప్పింది.  ప్రభుత్వరంగ చమురు సంస్థల కంటే తక్కువ ధరకే చమురును విక్రయించనున్నట్లు తెలిపింది.

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ కంపెనీ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలపై వినియోగదారులకు శుభవార్త చెప్పింది.  ప్రభుత్వరంగ చమురు సంస్థల కంటే తక్కువ ధరకే చమురును విక్రయించనున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు విక్రయించే ఇంధనం ధర కంటే 1 రూపాయి తక్కువకే పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్టుగా నయారా ఎనర్జీ నుంచి ప్రకటన వెలువడింది. 
 


అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ధరలను యథాతథంగా ఉంచాయి. అయితే ప్రైవేట్ ఇంధన రిటైలర్లు మాత్రం వినియోగదారులకు ప్రయోజనాలను అందించడం ప్రారంభించారు.
 

నయారా కంటే ముందు రిలయన్స్ - బీపీ సుపీరియర్ గ్రేడ్ క్వాలిటీ డీజిల్‌ను రూ.1 తక్కువకే విక్రయించనున్నట్లు ప్రకటించిన సంగతి  తెలిసిందే. తాజాగా నయారా  ఎనర్జీ నుంచి కూడా ఇలాంటి ప్రకటనే వెలువడటం  గమనార్హం. 
 

‘‘దేశీయ వినియోగాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు, స్థానిక వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మేము జూన్ 2023 చివరి వరకు మా రిటైల్ అవుట్‌లెట్‌లలో 1 రూపాయి తగ్గింపును ప్రవేశపెట్టాము’’ అని నయారా ఎనర్జీ ప్రతినిధి తెలిపారు.

‘‘భారతదేశం ఇంధన అవసరాలకు బలమైన భాగస్వామిగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. దేశం యొక్క వినియోగ డిమాండ్‌కు సేవలను కొనసాగిస్తాము’’ అని నయారా సంస్థ పేర్కొంది. నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా 6,376 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఇక, దేశంలోని మొత్తం 86,925 పెట్రోల్ పంపుల్లో 78,567 ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ల వద్ద ఉన్నాయి.
 

ఇదే కారణం?.. ప్రభుత్వరంగ సంస్థలు చమురు ధరలను స్థిరంగా కొనసాగించడంతో ప్రైవేట్ సంస్థలు నష్టాలు భరించలేక అధిక ధరకు పెట్రోల్, డీజిల్ ను విక్రయించాయి. దీంతో ప్రైవేట్ చమురు రంగ సంస్థలు మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి రావడంతో వినియోగదారులకు స్పల్ప ఊరటను ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Latest Videos

click me!