కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అందులో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఇది బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి నిజంగా శుభవార్త. ఎందుకంటే తగ్గిన కస్టమ్ డ్యూటీ వల్ల బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం గోల్డ్, సిల్వర్ పై కస్టమ్ డ్యూటీని తగ్గించడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే బంగారం, వెండి లిక్విడిటీ పెంచేందుకు ఇలా కస్టమ్ డ్యూటీని తగ్గించారు. అందుకే బంగారం, వెండి ధరలు తగ్గి, వాటిని దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది.