ఉద్రిక్తతల మధ్య వాణిజ్యం: 100 బిలియన్ డాలర్లకు చైనా-ఇండియా దిగుమతులు.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్సే అధికం

First Published Jan 26, 2022, 2:41 AM IST

భారత్, చైనా మధ్య సంబంధాల్లో హెచ్చు తగ్గులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాణిజ్య రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరంలో మొదటిసారిగా చైనా నుండి భారతదేశంలోకి దిగుమతులు దాదాపు 100 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. 

ఒక నివేదిక ప్రకారం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, యంత్రాలు, ఎరువులు, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియల్స్ (APIs) దిగుమతులు భారీగా పెరిగాయి. చైనా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) నుండి వచ్చిన సమాచారం ప్రకారం 2021లో భారతదేశానికి ఎగుమతులు 97.52 బిలియన్‌ డాలర్లలకు చేరుకోగా, మొత్తం టు-వే  ద్వైపాక్షిక వాణిజ్యం 125.66 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.
 

జి‌ఏ‌సి‌సి(GACC) ప్రకారం 
స్మార్ట్‌ఫోన్‌లు, స్టోరేజ్ యూనిట్‌లతో సహా ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల షిప్‌మెంట్‌లు అతిపెద్ద పెంపును చూశాయి. ఈ వస్తువులలో టెలికాం ఎక్విప్మెంట్, ఆటో విడిభాగాలు, యంత్రాల పరికరాలు, ప్రత్యేక రసాయనాలు, ఎరువులు వంటి యూరియా, అమ్మోనియా సల్ఫేట్ ఇతర ఉన్నాయి.
 

పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులలో వృద్ధి 
భారత వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా విదేశీ వాణిజ్య పనితీరు విశ్లేషణ ప్రకారం, 2021 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో చైనా నుండి ప్రధాన దిగుమతి వస్తువులు పెట్రోలియం (ముడి) అండ్ పెట్రోలియం ఉత్పత్తులు, ముత్యాలు, విలువైన రాళ్ళు - పాక్షిక విలువైన రాళ్లు ఉన్నాయి. దీనితో పాటు బొగ్గు, కోక్ అండ్ బ్రికెట్ల దిగుమతిలో భారీ పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో చైనా నుంచి వచ్చిన మొత్తం దిగుమతుల్లో ఈ వస్తువుల వాటా దాదాపు 60 బిలియన్ డాలర్లు. డిసెంబర్‌కు సంబంధించిన కమోడిటీ  డేటాను భారతదేశం ఇంకా విడుదల చేయలేదు.
 

చైనాపై భారత్ ఆధారపడటం పెరగవచ్చు
ఒక మీడియా నివేదిక ప్రకారం చైనాతో రాజకీయ సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ 'ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్'పై అమెరికా ఆధారపడడాన్ని తగ్గించుకోలేకపోయిందని ఒక జే‌ఎన్‌యూ ప్రొఫెసర్ అన్నారు. భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భారతదేశం కూడా చైనా ఆర్థిక వ్యవస్థ నుండి విడిపోలేకపోయింది. కరోనా మహమ్మారి నుండి మన పరిశ్రమలు పూర్తిగా కోలుకున్నప్పుడు భారతదేశం చైనాపై ఆధారపడటం మరింత పెరుగుతుందని కూడా ఆయన అన్నారు.
 

అదే సమయంలో చైనా  గ్లోబల్ టైమ్స్ నివేదిక కూడా 2021 చైనా-భారత్ వాణిజ్యం 125 బిలియన్ డాలర్లను అధిగమించిందని, ఇది రికార్డు స్థాయిలో అధికమని పేర్కొంది. అలాగే రెండు దేశాల ఉద్రిక్తతల మధ్య, భారతదేశం చైనా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోలేకపోతుందనడానికి ఇది రుజువు అని తెలిపింది. చైనా నుండి ఎపిఐల దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తొలగించడానికి కూడా చాలా సమయం పడుతుందని ఆర్థికవేత్త అజిత్ రానడే అన్నారు.

click me!