బడ్జెట్ 2022: ఈసారి విద్యా రంగంపై భారీగా ఆశలు.. కోతకు బదులు కేటాయింపులు పెరుగుతాయని అంచనా..

First Published | Jan 18, 2022, 10:33 AM IST

కేంద్ర బడ్జెట్‌(union budget)  ప్రకటనకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎప్పటిలాగే  1 ఫిబ్రవరి 2022న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ(economy system)కు ఊపునిచ్చేలా బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 

 వివిధ రంగాలతో పాటు విద్యాశాఖ కూడా ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి బడ్జెట్ పెంచే అవకాశం ఉంది. 
 

గత బడ్జెట్‌లో 6 శాతం తగ్గింపు 
ఈసారి బడ్జెట్ 2022 నుండి విద్యారంగం చాలా ఆశలు పెట్టుకుంది. గత ఏడాది లాగానే విద్యా రంగానికి ఈసారి బడ్జెట్‌లో కోత పెట్టకుండా  ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విశేషమేమిటంటే, గతేడాది వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన నిధులను 6 శాతం తగ్గించింది. ఈ కోత తర్వాత బడ్జెట్‌లో విద్యా రంగానికి మొత్తం రూ.93,223 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాది విద్యారంగానికి రూ.99,311 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.

ఈ ఏడాది బడ్జెట్‌ను పెంచుతామని 
ఈ ఏడాది ప్రభుత్వం విద్యరంగంపై బడ్జెట్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. 2022-23 బడ్జెట్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఈ ఏడాది దాదాపు 10 శాతం కేటాయింపులను పెంచవచ్చని అంచనా. విశేషమేమిటంటే, గత సంవత్సరం చేసిన తగ్గింపు కరోనా మహమ్మారి సమయంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ఈ కోత ఆరోగ్య సంరక్షణ రంగానికి ఖర్చు చేయబడుతుందని తెలిపింది. ఈసారి కూడా దేశంలో బడ్జెట్‌ను కరోనా నీడలో సమర్పించబోతున్నారు, అయితే  విద్యా రంగం బడ్జెట్‌లో కోతకి బదులు  కేటాయింపు పెరుగుతుందని భావిస్తున్నారు. 
 


 బడ్జెట్ పై ఊహాగానాలు 
కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై, ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో  విద్యార్థులందరూ ప్రైవేట్ సంస్థలు అందించే విద్యా వనరులపై ఆధారపడటం పెరిగింది. ఇంకా వీటిని  విద్యా సేవల క్రింద వర్గీకరించబడ్డాయి అలాగే 18% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)ని ఆకర్షిస్తాయి. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఈ కేటగిరీకి సంబంధించిన జీఎస్టీ రేటును 5 శాతానికి సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Latest Videos

click me!