Union Budget 2022: బ్రీఫ్‌కేస్ టు బహీ ఖాతా ఇప్పుడు టాబ్లెట్, మార్పులు ఇవే..

First Published Jan 17, 2022, 2:22 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) 2019లో తన మొదటి యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఆమె బడ్జెట్ ని బ్రీఫ్‌కేస్‌(briefcase)కి బదులుగా "బహీ ఖాతా "తో భర్తీ  చేసి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో బహీ ఖాతా(bahi khata)తో బడ్జెట్ ప్రవేశపెట్టే నిర్ణయం బ్రీఫ్‌కేస్‌ పద్ధతిని పారద్రోలే చర్యగా కనిపించింది.

"బడ్జెట్ బ్రీఫ్‌కేస్" అనేది వలస పాలనకి చెందినా పద్దతి. ఇది గ్లాడ్‌స్టోన్ బాక్స్ కాపీ, దీనిని బ్రిటిష్ ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్‌లను సమర్పించేటప్పుడు పార్లమెంటుకు తీసుకువెళ్ళేవారు.

గత సంవత్సరాలుగా భారతీయ కుటుంబాలు, స్టోర్లు, చిన్న సంస్థలు బడ్జెట్‌ను ఖాతాల లెడ్జర్ అయిన బహీ ఖాతాని ఉపయోగించి నిర్వహించాయి.

గత సంవత్సరం 2020లో నిర్మలా సీతారామన్ ఈ పద్దతిని కొనసాగిస్తు బహీ ఖాతాను ఉపయోగించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే భారతదేశం "బ్రిటీష్ హ్యాంగోవర్"ని తొలగించే సమయం వచ్చిందని ఆమె చెప్పారు. బ్రీఫ్‌కేస్ కంటే బహీ ఖాతాని క్యారి చేయడం సులభం అని కూడా ఆమె అంగీకరించారు.
 

అయితే గత సంవత్సరం బహీ ఖాతా పద్దతికి స్వస్తి పలుకుతూ టాబ్లెట్‌కు దారితీసింది, అలాగే "డిజిటల్ ఇండియా" కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పిలుపుకి  ఒక ఎత్తుగడ వేసింది. ఆ సమయంలో కొన్ని నివేదికలు ఈ టాబ్లెట్ "మేడ్ ఇన్ ఇండియా" టాబ్లెట్ అని తెలిపాయి, దీంతో సెల్ఫ్ రిలయంట్ నేషన్  అనే మెసేజ్ పంపే ప్రయత్నం చేసింది.

అయినప్పటికీ కాగితపు వాడకాన్ని అరికట్టడం వివేకవంతమైనది కాబట్టి , కోవిడ్-19 మహమ్మారి కారణంగా టాబ్లెట్‌ను ఉపయోగించడం కూడా అవసరం. అంతేకాకుండా ఇది పర్యావరణ అనుకూలమైన చర్య అని కూడా కొందరు వాదించారు.

గత సంవత్సరం చట్టసభ సభ్యులు  ప్రజల కోసం బడ్జెట్ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం "యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్"ని కూడా ప్రారంభించింది.

గత కొన్నేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం కాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. 1947లో భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి లెదర్ బ్యాగ్‌ని ఉపయోగించారు.

కొంతకాలం క్రితం 1970లో ఆర్థిక మంత్రులు లేధర్ బ్యాగ్‌ని తీసుకెళ్ళడం ప్రారంభించారు అలాగే దాని రంగు సంవత్సరాలుగా మారుతూనే ఉంది.

2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందిన తరువాత పెద్ద మార్పు వచ్చింది.
 

click me!