జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకే సేవలందిస్తుండటంతో బీఎస్ఎన్ఎల్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. బీఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ధరకే డేటా ప్లాన్లను అందిస్తోంది.
తక్కువ ధరకే ఎక్కువ డాటా అందించే చక్కటి ప్లాన్ల వివరాలు ఇవిగో..
రూ.97 ప్లాన్
రూ.97 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
రూ.98 ప్లాన్
రూ.98 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా లభిస్తుంది. అపరిమితంగా లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
రూ.98 ప్లాన్
రూ.98 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా లభిస్తుంది. 2GB డేటా అయిపోయాక 40 kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్ లేవు. దీని వ్యాలిడిటీ 18 రోజులు మాత్రమే.
రూ.94 ప్లాన్
రూ.94 ప్లాన్‌లో మొత్తం 30GB డేటా లభిస్తుంది. 200 నిమిషాల స్థానిక, అంతర్జాతీయ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
రూ.151 ప్లాన్
రూ.151 ప్లాన్ ను గాని మీరు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 40 GB డేటా లభిస్తుంది. అయితే కాల్స్ వసతి లేదు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
రూ.198 ప్లాన్
రూ.198 ప్లాన్‌లో మీరు రోజుకు 2GB డేటా పొందవచ్చు. 2GB డేటా అయిపోయాక 40 kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే అపరిమిత కాల్స్ లేవు. ఈ ప్లాన్ 40 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.