హెల్త్ బాగోలేదని డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు టెస్టులు చేసి మెడిసన్ రాసిస్తారు కదా.. వాటిని మెడికల్ షాపుల్లో కొనుక్కొని వాడతారు. ఒక్కోసారి ఎన్ని మెడిసన్స్ వాడినా రోగం మాత్రం తగ్గదు. పైగా పెరిగిపోతుంది. దీంతో మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్తే మందులు మార్చి రాస్తారు. అవి వాడితే అప్పుడు తగ్గుతుంది. ఇలా చాలా మందికి జరిగి ఉంటుంది కదా.. దీనికి కారణం ఫేక్ మెడిసన్ వాడటం. మరి మీరు కొన్నవి రియల్ మెడిసనా? ఫేక్ మెడిసనా తెలుసుకోవాలంటే ఇలా చేయండి.
భారతదేశంలో నకిలీ మందులు ఎంతలా పెరిగిపోయాయంటే ప్రతి బ్రాండ్ కంపెనీ మెడిసన్ కి నకిలీ బ్రాండ్స్ మార్కెట్లో దొరికేస్తున్నాయి. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ మందుల వల్ల ఉన్న రోగాలు తగ్గకపోగా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అందుకే కేంద్రం ఈ సమస్యకు చెక్ చెప్పడానికి ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది.
నకిలీ మందులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ముఖ్యమైన బ్రాండ్ మెడిసన్ షీట్ పై QR కోడ్ ప్రింట్ చేయించింది. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు ఆ మెడిసన్ కు సంబందించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఆ డ్రగ్ పేరు, దాన్ని తయారు చేసిన కంపెనీ డీటైల్స్, బ్యాచ్ నంబర్, మెడిసన్ తయారు చేసిన డేట్, ఎక్స్‌పైరీ డేట్, లైసెన్స్ నంబర్ ఇలా ఆ మెడిసన్ కి సంబంధించి అన్ని వివరాలు తెలుస్తాయి.
ఒకవేళ మెడిసన్ పై QR కోడ్ స్కాన్ చేసినప్పుడు NO RECARDS FOUND అని వచ్చిందో ఆ మెడిసన్ ఫేక్ అని అర్థం. ఈ QR కోడ్ అన్ని మందులపై ఉండదు. కేవలం ముఖ్యమైన, ప్రజలు ఎక్కువగా, రెగ్యులర్ గా ఉపయోగించే మెడిసన్ పై మాత్రమే ఉంటుంది. QR కోడ్ లేనంత మాత్రాన అది ఫేక్ అనుకోవద్దు. QR కోడ్ ఉన్న మెడిసన్ ను స్కాన్ చేస్తే డీటైల్స్ కనిపించకపోతేనే ఫేక్ అని తెలుసుకోండి.