అమెరికా మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ టాయిలేట్ కుంభకోణం.. ?

First Published Jan 21, 2021, 11:27 AM IST

 అమెరికాలో జో బిడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు  బుధవారం చేపట్టారు. అమెరికా మాజీ అద్యక్షుడు అయిన డోనాల్డ్ ట్రంప్ గురించి గత కొంతకాలంగా కొత్త వివాదాలు వినిపిస్తున్నాయి. తాజా వివాదం ఏంటంటే టాయిలెట్ కుంభకోణం అని పిలువబడే డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు సంబంధించినది. వాస్తవానికి, ఇవాంకా ట్రంప్ తన రక్షణలో మోహరించిన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిబ్బందికి రెస్ట్ రూమ్(బాత్ రూమ్ ) సౌకర్యం కల్పించడానికి కోట్లాది ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌ రక్షణలోని సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిబ్బందికి ఇవాంకా ఒక పరిమితి విధించింది . అమెరికా అధ్యక్షుడి కుటుంబాన్ని రక్షించడానికి ప్రోటోకాల్ కింద మోహరించిన ఈ సైనికులు వారి విధి ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇవాంకా తన ఇంటి రెస్ట్ రూమ్ ఉపయోగించటానికి నిరాకరించింది, ఆమె ఇంట్లో మొత్తం 6 రెస్ట్ రూములు ఉన్నాయి.
undefined
అద్దె ఇల్లుఇటువంటి పరిస్థితిలో విధుల్లో ఉన్న సైనికులు మూడు కిలోమీటర్లు ప్రయాణించి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంటికి వెళ్లి అక్కడి రెస్ట్ రూమ్ ఉపయోగించే వారని కొందరు ఆరోపించారు. ఇంత దూరం ప్రయాణించిన తరువాత సైనికులు తిరిగి వెళ్ళటానికి చాలా సమయం పట్టేది. కాబట్టి ఇవాంకా దీనికోసం మరొక మార్గం కనుగొన్నారు. సీక్రెట్ ఏజెంట్లు ఇక్కడే రెస్ట్ రూమ్ ఉపయోగించుకునేలా ఇవాంకా ఇంటి దగ్గర మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంటి అద్దె నెలకు సుమారు 2 లక్షల 20 వేల రూపాయలు. ఈ విధంగా కేవలం నాలుగేళ్లలో టాయిలెట్ కోసం మాత్రమే 74 లక్షలకు పైగా ఖర్చు చేశారట.
undefined
ప్రతిపక్ష పార్టీ నుండి ఈ వార్తలు వెలువడిన తరువాత ఇవాంకా అనవసరంగా ఖర్చు చేస్తున్నారు అని విమర్శించారు. ఇవాంకా ఇంట్లో 6 రెస్ట్ రూమ్ లు ఉన్నప్పటికీ అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం సరికాదని డెమొక్రాట్లు అంటున్నారు. 2016లో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నప్పుడు, తన న్యూయార్క్ సిటీ అపార్ట్మెంట్లో బంగారుతో తయారు చేసిన కమోడ్ చిత్రం వైరల్ అయ్యింది. అయితే ట్రంప్ ఇంట్లో బంగారంతో చేసిన కమోడ్ సరైన సమాచారం లేదు.
undefined
బాత్రూంలో వాటర్ ఫిక్చర్స్ కారణంగా నీటి కొరత ఉందని అధ్యక్షుడు ఫిర్యాదు చేసినప్పుడు ట్రంప్ కూడా ఈ టాయిలెట్ విషయం తెరపైకి వచ్చింది. చాలా పాశ్చాత్య దేశాలలో, నీరు వృథా కాకుండా ఉండటానికి బాత్‌రూమ్‌లలో వాటర్ ఫిక్చర్‌లను ఏర్పాటు చేస్తారు. ఇది ఒక రకమైన సిస్టం, దీని నుండి పరిమితమైన నీరు ట్యాప్ నుండి లేదా షవర్ నుండి వస్తుంది.
undefined
ట్రంప్ వైట్ హౌస్ నుండి వెళ్లిపోయే ముందు అలాగే కొత్త అధ్యక్షుడు రాకముందే మొత్తం భవనం ఒకసారి శుభ్రం చేయబడుతుంది. ఇందుకోసం డీప్ క్లీన్ ఖర్చు 1 కోటి రూపాయలు.
undefined
click me!