ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అధిక వడ్డీలిచ్చే బెస్ట్ బ్యాంకులివే

First Published | Sep 3, 2024, 9:57 PM IST

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలన్న ఆలోచనలలో ఉన్నారా? SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, PNB వంటి ప్రముఖ బ్యాంకులు అందించే స్థిర డిపాజిట్ల(FDలు)పై వడ్డీ రేట్లను మీ కోసం అందిస్తున్నాం. సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్లకు కొన్ని బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. వడ్డీ రేట్లను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోండి. 

ఈ రోజుల్లో ఫైనాన్సియల్ సపోర్ట్ చాలా ముఖ్యం. అందుకోసం సరైన పెట్టుబడి ఎంపికలను ఎంచుకోవడం చాలా కీలకం. రిస్క్ లేకుండా  స్థిరమైన రాబడిని పొందాలనుకొనే వారికి స్థిర డిపాజిట్లు(FDలు) సరైన ఎంపిక అవుతాయి. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై దేశంలో కొన్ని బ్యాంకులు పోటీపడి వడ్డీ రేట్లను అందిస్తున్నాయ. సరైన బ్యాంకును ఎంచుకోవడం ద్వారా మీరు ఫైనాన్సియల్ గా డెవలప్ కావచ్చు. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు అందించే అత్యుత్తమ 5 సంవత్సరాల FD వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం. 

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన బ్యాంకు ఎస్బీఐ. సాధారణ ప్రజలకు 6.5% వడ్డీ రేటును SBI అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ రేటు ఇస్తోంది. అయితే 2, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ రేటు లభిస్తోంది.

2. బ్యాంక్ ఆఫ్ బరోడా

ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.5%, సీనియర్ సిటిజన్లకు 7.15% వడ్డీ రేటును బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తోంది. అదే సమయంలో 399 రోజుల రుతుపవన ధమాకా పథకం కింద సాధారణ ప్రజలకు 7.25% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ లభిస్తోంది.

Latest Videos


3. HDFC బ్యాంక్

ప్రైవేటు బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ రేటును HDFC బ్యాంక్ అందిస్తోంది. అదే సమయంలో 55 నెలల FDలో సాధారణ ప్రజలకు 7.4% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.9% వడ్డీ లభిస్తుంది.

4. ICICI బ్యాంక్

ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై సాధారణ ప్రజలకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ రేటును ICICI బ్యాంక్ అందిస్తుంది. ఇది కాకుండా 15 నుండి 18 నెలల వరకు మ్యూచువల్ ఫండ్ స్థిర డిపాజిట్లపై 7.25% నుండి 7.8% వరకు వడ్డీ లభిస్తుంది.

5. కోటక్ మహీంద్రా బ్యాంక్

ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.2% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 6.7% వడ్డీని కోటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తుంది. బ్యాంకు అత్యధిక వడ్డీ రేటు 7.4%. ఇది 390 రోజుల స్థిర డిపాజిట్లపై అందుతుంది. 

6. పంజాబ్ నేషనల్ బ్యాంక్

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు ముందుంది. ఇక్కడ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై సాధారణ ప్రజలకు 6.5%, సీనియర్ సిటిజన్లకు 7% వడ్డీ రేటును PNB బ్యాంక్ అందిస్తుంది. ఈ బ్యాంక్ 400 రోజుల FDలపై 7.25% వడ్డీని కూడా అందిస్తోంది .

వడ్డీ రేట్లను సరిపోల్చడం ముఖ్యం

ఈ బ్యాంకులన్నీ ఐదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడటం, తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఇది మీ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. 

click me!