డిసెంబర్ 31లోగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే.. లేదంటే కొత్త ఏడాది ఇబ్బందులు తప్పవు..

First Published Dec 23, 2021, 7:19 PM IST

మరి కొద్ది రోజుల్లో 2021 సంవత్సరం ముగియబోతోంది అలాగే కొత్త సంవత్సరం ప్రారంభానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ మిగిలిన రోజుల్లో మీరు కొన్ని ముఖ్యమైన పనిలని పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం, లేకుంటే కొత్త సంవత్సరంలో మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. 

జనవరి 1 నుండి జరగబోయే ముఖ్యమైన మార్పుల గురించి అలాగే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడం గురించి తెలుసుకోండి. ఈపీఎఫ్ ఖాతాలో ఈ-నామినీ దాఖలు చేసినప్పటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2021 అని గమనించాలి. డిసెంబర్ 31లోపు మీరు పూర్తి చేయాల్సిన పనులు ఎంతో తెలుసుకోండి...


ఐటీ రిటర్న్‌  
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును 31 డిసెంబర్ 2021 వరకు ప్రభుత్వం పొడిగించింది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ అండ్ కరోనా వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ ITRని డిసెంబర్ 31వ తేదీలోగా ఫైల్ చేయాలి, తద్వారా వారు పెనాల్టీని తప్పించుకోవచ్చు.
 

మీరు కూడా పింఛనుదారుల కేటగిరీలోకి వస్తే పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికేట్ మీరు డిసెంబర్ 31న లోగా సమర్పించండి. పింఛనుదారులు డిసెంబరు 31లోగా సర్టిఫికెట్ సమర్పించాలని, లేకుంటే పింఛను పొందడం ఆగిపోతుందని తెలిపింది. అయితే సంవత్సరానికి ఒకసారి పెన్షనర్లు తమ ఉనికికి సంబంధించిన రుజువును అంటే నవంబర్ 30లోపు లైఫ్ సర్టిఫికేట్  సమర్పించాలి, అయితే ఈసారి ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. లైఫ్ సర్టిఫికేట్  డాక్యుమెంట్ సమర్పించడం ద్వారా పెన్షనర్ జీవించి ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది.

యూ‌ఏ‌ఎన్ 
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)సభ్యులు  UAN నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. యూఏఎన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. EPFO పెట్టుబడిదారులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయింది. ఇలా చేయకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తి పీఎఫ్ ఖాతా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.

డీమ్యాట్-ట్రేడింగ్ ఖాతా   
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ ఖాతాల KYC నిర్వహణ కోసం గడువును 30 సెప్టెంబర్ 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించింది. డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ ఖాతాలో KYC కింద పేరు, చిరునామా, PAN కార్డ్ నంబర్, ప్రస్తుత మొబైల్ నంబర్, వయస్సు, సరైన ఇమెయిల్ ID వంటి వివరాలను అప్‌డేట్ చేయాలి.

డిసెంబర్ 31 వరకు  హోమ్ లోన్ 
మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ అయితే మీరు డిసెంబర్ 31 వరకు చౌక గృహ రుణాన్ని పొందవచ్చు. పండుగ సీజన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ రేటును 6.50 శాతానికి తగ్గించింది, ఇప్పుడు ఇది డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మినహాయింపు జనవరి 1తో ముగుస్తుంది. 

కొత్త సిస్టమ్ 
ఇండస్ట్రీ బాడీ FICCI కస్టమర్ల డెబిట్-క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన సమాచారాన్ని సమర్పించడానికి బదులుగా టోకెన్ నంబర్‌లను జారీ చేసే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీని వల్ల ఆన్‌లైన్ వ్యాపారులు 20 నుండి 40 శాతం ఆదాయాన్ని కోల్పోవచ్చు. 
 

click me!