పవర్‌బీట్స్ ప్రో 2 ధర, రంగులు
పవర్‌బీట్స్ ప్రో 2 ధర రూ. 29,900. జెట్ బ్లాక్, క్విక్ సాండ్, హైపర్ పర్పుల్ మరియు ఎలక్ట్రిక్ ఆరెంజ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఈ డివైస్ ఫిబ్రవరి 13న మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డైనమిక్ హెడ్ ట్రాకింగ్, స్పేషియల్ ఆడియోతో, లేెెటెస్ట్ వెర్షన్ ఇయర్ ఫోన్స్ ఇవి. వీటిల్లో అదనంగా అడాప్టివ్ EQని ఉంది. ఇది వినియోగదారుల చెవికి అనుకూలంగా సెట్ అవుతుంది. ఇయర్‌బడ్‌లు ట్రాన్స్‌పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)లను కూడా కలిగి ఉన్నాయి. దాదాపు 1,000 మంది అథ్లెట్లు పవర్‌బీట్స్ ప్రో 2ని పరీక్షించారని కంపెనీ ప్రకటించింది.