బ్యాంకులకు వెళుతున్నారా అయితే ఈ వివరాలు తెలుసుకోండి...

First Published Dec 30, 2019, 1:07 PM IST

సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్తుంతరు. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు సంభందించి, విద్యార్దులు స్కాలర్షిప్ సంబంధించి, రిటైర్ ఉద్యోగులు పెన్షన్ సంభందించి ఇలా రకరకాల అవసరాలకు సంభందించి బ్యాంకులకు వెళ్తుంటారు. 

సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్తుంతరు. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు సంభందించి, విద్యార్దులు స్కాలర్షిప్ సంబంధించి, రిటైర్ ఉద్యోగులు పెన్షన్ సంభందించి ఇలా రకరకాల అవసరాలకు సంభందించి బ్యాంకులకు వెళ్తుంటారు. మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది.
undefined
కొత్త ఏడాదిలో బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో, ఏ రోజు సెలవు ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకొని దానికి అనుకూలంగా వారి ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం. 2020 సంవత్సరంలో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.
undefined
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బి‌ఐ) వచ్చే ఏడాది నుండి బ్యాంకు సెలవుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హైదరాబాద్ లోని రీజనల్ ఆఫీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ ఆఫీస్ పరిధిలోని బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉంటాయో ప్రకటించింది.
undefined
వచ్చే ఏడాది బ్యాంకులకు మొత్తం 20 రోజుల సెలవులను కేటాయించారు. మీరు ఎక్కువగా బ్యాంకులకు వెళ్ళే వారైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ పనులను చేసుకోవాల్సి ఉంటుంది.
undefined
1. జనవరిలో 15వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 26న రిపబ్లిక్ డే కూడా అధికారిక సెలవు. కానీ ఆరోజు ఆదివారం కావడంతో కలిసొచ్చింది.
undefined
2. ఇక ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఒక్కటే రోజు సెలవు ఉంటుంది. అది ఫిబ్రవరి 21న మహాశివరాత్రి సందర్భంగా హాలిడే ఇచ్చారు.
undefined
3. మార్చిలో బ్యాంకులకు 2 రోజులు సెలవులు ఉన్నాయి. మార్చి 9న హోలీ పండుగ, మార్చి 25న ఉగాది పండుగ ఉండటంతో రెండు సెలవులు ఉన్నాయి.
undefined
4. ఏప్రిల్‌లో బ్యాంకులకు ఎక్కువగా 4 రోజులు సెలవులు వొచ్చాయి. ఏప్రిల్ 1న ఆన్యువల్ క్లోజింగ్ డే కారణంగ, ఏప్రిల్ 2న శ్రీరామనవమి పండుగ, ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రావడంతో సెలవులు ఉన్నాయి.
undefined
5. వేసవి కాలం మే నెలలో బ్యాంకులకు రెండు రోజులు సెలవులున్నాయి. మే 1న మే డే కావడంతో, మే 25న రంజాన్ పండుగా సందర్భంగా హాలిడే ఇచ్చారు.
undefined
6. జూన్, జూలైలో బ్యాంకులకు ఎటువంటి సెలవులు లేవు. ఆగస్ట్‌ నెలలో మళ్ళీ నాలుగు రోజులు సెలవులు వొచ్చాయి. ఆగస్ట్ 1న బక్రీద్ పండుగ, ఆగస్ట్ 11న శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 22న వినాయక చవితి పండుగ కావడంతో సెలవులు ఉన్నాయి.
undefined
7. సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఒక్క రోజు కూడా సెలవులు లేవు. కానీ అక్టోబర్‌లో మూడు రోజులు సెలవులున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 24న దసరా పండుగా, అక్టోబర్ 30న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులున్నాయి.
undefined
8. నవంబర్‌లో బ్యాంకులకు రెండు సెలవులు వచ్చాయి. నవంబర్ 14న దీపావళి పండుగా, నవంబర్ 30న గురునానక్ జయంతి సందర్భంగా సెలవులు ఇచ్చారు.
undefined
9. డిసెంబర్‌లో 25న క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులకు ఒక రోజు మాత్రమే సెలవు ఉంది.
undefined
10. ఈ సెలవులు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌ పరిధిలోని అన్నీ బ్యాంకులకు వర్తిస్తాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. వీటిని ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకు పనులను చేసుకోండీ.
undefined
click me!