సీఎన్జీ పవర్, మైలేజ్ అదుర్స్
బజాజ్ ఫ్రీడం 125లో 124.58 సీసీ 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 9.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్, సింగిల్ సిలిండర్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బైక్ సీఎన్జీలో కిలోకు 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీన్ని బట్టి పెట్రోల్ ఖర్చులు ఎంత ఆదా అవుతాయో మీరే ఊహించుకోండి.