కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తున్నఏథర్ ఎనర్జీ కంపెనీ తన 450X పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. భారత ఆటో మార్కెట్లో ఏథర్ ఎనర్జీ కి ప్రత్యేక మార్కు ఉంది. తక్కువ ధరకు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వెహికల్స్ తయారు చేసి విక్రయించడంలో ఏథర్ ముందుంటుంది. ఏథర్ నుంచి 450X, 450 అపెక్స్ వంటి మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
Ather 450X బ్యాటరీల సామర్థ్యాన్ని బట్టి రెండు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ 90 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఆల్-LED లైటింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐదు రైడింగ్ మోడ్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. స్మార్ట్ ఎకోలో ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ వంటి అదనపు ఫీచర్‌లు కూడా ఉన్నాయి.