ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతం అదానీ భార్య గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..?

First Published Jan 8, 2023, 2:56 PM IST

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ నికర విలువ 131.3 బిలియన్ డాలర్లుగా ఉంాది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలుసా ?

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో వ్యక్తిగా ఉన్నారు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అదానీ నికర విలువ 131.3 బిలియన్ డాలర్లు. భారతదేశంలో ముఖేష్ అంబానీని కూడా అధిగమించాడు. అయితే అతని భార్య ప్రీతి అదానీ గురించి ఎవరికి తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. 
 

దేశంలోని నం.1 రిచ్ గౌతం అదానీ భార్య ప్రీతి అదానీ స్వతహాగా ఓ డెంటిస్ట్,  అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ భార్య అయినప్పటికీ,  ఆమె సాధారణ జీవనశైలికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ధనిక వ్యాపారవేత్త భార్యగానే కాకుండా, ప్రీతి స్వయంగా విద్యావేత్త కూడా. ఆమె అదానీ గ్రూప్‌ నకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్ కూడా ఉన్నారు. 
 

ప్రీతి అదానీ సాధారణ చీరలు, సల్వార్‌లు ధరించి సాధారణ జీవనశైలిని గడపడానికి ఇష్టపడతారు. సాదా రంగు కాటన్ చీరలు ఎక్కువగా ధరిస్తారు. లైట్ సల్వార్ కమీజ్‌లో పబ్లిక్‌గా కనిపిస్తారు. 

ప్రీతి అదానీ ప్లాటినం, వజ్రాల కంటే ముత్యాలను ఎక్కువగా ఇష్టపడతారు. ముత్యాల ఆభరణాలు ధరించడం ఇష్టం. చాలా సార్లు ఆమె ముత్యాల చెవిపోగులు, ముత్యాల హారంలో  కనిపించారు.

చాలా మంది వ్యాపారవేత్తల భార్యలకు క్రేజ్ ఉన్నట్లే, గౌతమ్ అదానీ భార్య ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, షూలు, వాచీలపై పెద్దగా ఆసక్తి చూపదు. ఆమె ఎప్పుడూ నార్మల్ గా కనిపిస్తారు. ఆమె తరచుగా లెదర్ స్ట్రాప్ వాచీలు ధరించి కనిపిస్తారు.
 

ప్రీతి అదానీ ఆమె మంచి వ్యాపారవేత్త, కంపెనీలో తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు.. 2018-2019లో, ప్రీతి అదానీ నాయకత్వంలో, ఆమె నాయకత్వంలోని డివిజన్ లాభం రూ.95 కోట్ల నుండి రూ.128 కోట్లకు పెరిగింది. ఆమె అదానీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.

priti adani

గౌతమ్ అదానీ ఏ సంపన్న కుటుంబం నుంచి రాలేదు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగి అదానీ గ్రూపును స్థాపించారు. అహ్మదాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గౌతమ్ పాఠశాల విద్య తర్వాత కామర్స్ డిగ్రీలో చేరాడు, కానీ కొన్ని కారణాల వల్ల డిగ్రీ పూర్తి చేయలేదు. ఆయన పెద్దగా చదువుకోలేదు.
 

click me!