Apple Watch Series 10 స్మార్ట్‌వాచ్ సిరీస్ 9 కంటే అనేక మెరుగైన సౌకర్యాలను కలిగి ఉంది. ఈ రెండు వెర్షన్‌ల మధ్య ఉన్న ప్రధాన తేడాలు తెలుసుకుంటే మీరు ఏ వాచ్ కొనాలో నిర్ణయించుకోగలరు. ధరలో రెండింటి మధ్య పెద్ద తేడాలు లేనప్పటికీ రెండు వాచీల స్మార్ట్ ఫీచర్‌లు, ఆరోగ్యం, ఫిట్‌నెస్ విశేషాలు తెలిపే సమాచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే సిరీస్ 10 కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు, ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అవేంటో తెలుసుకుందాం.
డిజైన్
Apple Watch Series 10 చాలా అందమైన డిజైన్ కలిగి ఉంది. సిరీస్ 9 మందం 10.7mm ఉండగా, సిరీస్ 10 కేవలం 9.7mm మందం మాత్రమే ఉంది. సిరీస్ 10 రోజంతా ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
సిరీస్ 10 గుండ్రని అంచులను కలిగి ఉంది. 9 కంటే కొంచెం పెద్ద కేస్ సైజులను కలిగి ఉంది. వరుసగా 42mm, 46mm కొలతలతో పెద్ద డిస్‌ప్లే అందరినీ ఆకర్షిస్తుంది.
బరువు
Apple Watch Series 10 బరువు కూడా తక్కువగానే ఉంది. అల్యూమినియం వేరియంట్లు దీనికి ఉపయోగించడంతో సిరీస్ 9 కంటే 10% తేలికగా ఉంది. సిరీస్ 10 కేస్ మెటీరియల్‌కు టైటానియం ఉపయోగించారు. సిరీస్ 9 కేమో స్టెయిన్‌లెస్ స్టీల్ వాడారు. టైటానియం వెర్షన్‌లు బరువు తక్కువ ఉండటంతో చేతిపై చాలా సింపుల్ గా కనిపిస్తాయి. సిరీస్ 10 అద్భుతమైన జెట్ బ్లాక్ పాలిష్డ్ అల్యూమినియం ఎండింగ్ మోడల్ లో లభిస్తోంది. అంతేకాకుండా నాచురల్, గోల్డ్, స్లేట్ టైటానియం వేరియట్లు కూడా ఉన్నాయి.
డిస్‌ప్లే
Apple Watch Series 10 డిస్‌ప్లేకు చాలా మెరుగులు అద్దారు. ఇది ప్రతి పిక్సెల్ కాంతి ఉత్పత్తిని పెంచే విస్తృత కోణంతో కూడిన అత్యాధునిక OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది సిరీస్ 9 కంటే 40% వరకు ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది.
సిరీస్ 10 సిరీస్ 9 కంటే 9% వరకు ఎక్కువ యాక్టివ్ స్క్రీన్ స్థలాన్ని కలిగి ఉంది. అందువల్ల మీరు మెయిల్, సందేశాలు వంటి అప్లికేషన్‌లకు టెక్స్ట్ లైన్‌ను కూడా ఇక్కడ జోడించవచ్చు. కంటెంట్‌తో రాజీ పడకుండా ఫాంట్ సైజును కూడా పెంచవచ్చు.
సిరీస్ 10 ప్రతి సెకనుకు రిఫ్రెష్ అవుతుంది. అయితే సిరీస్ 9 నిమిషానికి ఒకసారి మాత్రమే రిఫ్రెష్ అవుతుంది.
చిప్‌సెట్
Apple సిలికాన్ రెండు వాచీలలో కూడా కనిపిస్తుంది. అయితే సిరీస్ 10 కొత్త S10 SiP(ప్యాకేజీలో సిస్టమ్)ని కలిగి ఉంది. S10 ప్రాసెసర్ మరింత ఇంటెల్లిజెంట్, సమర్థవంతంగా ఉంటుంది.
సిరీస్ 9 నుండి 4-కోర్ న్యూరల్ ఇంజిన్ సిరీస్ 10లో కూడా వాడారు. ఇది ఆటోమేటెడ్ వర్కౌట్ రికగ్నిషన్, ఆన్-డివైస్ సిరి, డబుల్ ట్యాప్ వంటి ఆప్షన్స్ ప్రత్యేక ఆకర్షణ. సిరీస్ 10 మరింత కంప్యూటింగ్ శక్తిని సూచించే అదనపు లక్షణాలను కలిగి ఉంది. సంభాషణల సమయంలో మెరుగైన వాయిస్ ఐసోలేషన్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్ ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఆప్షన్స్ అద్భుతమై ఫీల్ ను అందిస్తాయి.
ఫీచర్లు
Apple Watch Series 10, Series 9 రెండింటి లోనూ హార్ట్ రేట్ మానిటరింగ్, ECG, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, ఉష్ణోగ్రత సెన్సింగ్, సైకిల్ ట్రాకింగ్, పతనం గుర్తింపు, క్రాష్ డిటెక్షన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రెండు వాచీలు ఆరోగ్యం, ఫిట్‌నెస్ కు సంబంధించి ట్రాకింగ్ చేసి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి. అదనంగా వాటిలో Apple Pay, ఆన్-డివైస్ సిరి, ఫ్యామిలీ సెటప్, ఎమర్జెన్సీ SOS, అంతర్జాతీయ అత్యవసర కాల్ మాట్లాడేలా స్మార్ట్ ఫీచర్‌లు ఉన్నాయి.
6 మీటర్ల లోతు వరకు నీటి ఉష్ణోగ్రత కొలిచే సెన్సార్, నీటి లోతు గేజ్‌ను సిరీస్ 10 కలిగి ఉంది. దీని వల్ల ఇది స్విమ్మింగ్ చేసే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇందులో మ్యూజిక్ ఇంటిగ్రేటెడ్ స్పీకర్ ద్వారా ప్లే అవుతుంది. అందువల్ల వినియోగదారులు ఆడియోబుక్‌లు, పాడ్‌కాస్ట్‌లు, సంగీతాన్ని వినడానికి తమ వాచీలను ఉపయోగించవచ్చు. సిరీస్ 10 కాల్‌ల కోసం వాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.
బ్యాటరీ
Apple సిరీస్ 10, సిరీస్ 9 రెండింటికీ 18 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చారు. అయితే, సిరీస్ 10లో వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం కల్పించారు. ఇది సిరీస్ 9 కంటే 15 నిమిషాలు వేగంగా, దాదాపు 30 నిమిషాల్లో 0% నుండి 80% వరకు ఛార్జ్ చేయగలదు.
ధర
Apple Watch Series 10 ప్రారంభ ధర రూ. 44,900. Apple Watch Series 9 అధికారిక ధర కూడా రూ. 44,900. అయితే సిరీస్ 9 కు అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల తగ్గింపుతో కొనవచ్చు.