Apple మరో సూపర్ ఆఫర్: iPhoneలపై భారీ డిస్కౌంట్లు

First Published | Sep 15, 2024, 3:02 PM IST

Apple ఇటీవలే iPhone 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79,000 నుంచి రూ.1,10,000 వరకు ఉన్నాయి. సెప్టెంబర్ 10న iPhone 16 సిరీస్ రిలీజ్ అవ్వగా, కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే Apple కంపెనీ తన వినియోగదారులకు భారీ డిసౌంట్ ఆఫర్లు ప్రకటించింది. అవేంటో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

Apple ఇటీవల ఆవిష్కరించిన iPhone 16 సిరీస్‌లో పలు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. సెప్టెంబర్ 10న అఫీషియల్ గా 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ అభిమానులు కొత్త సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. 16 సిరీస్ ప్రారంభం కావడంతో వాటి ఫీచర్స్ తెలుసుకొని ఇప్పటికే ఆర్డర్లు కూడా పెట్టేశారు. సెప్టెంబర్ 13న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయని ఆపిల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 20న అమ్మకాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వినియోగదారుల నుంచి iPhone 16 సిరీస్ ఫోన్ల కోసం ఆర్డర్లు పెరుగుతుండటంతో ఫిక్స్ చేసిన ఫోన్ల తయారీ సంఖ్యను పెంచే ఆలోచనలో ఆపిల్ కంపెనీ ఉంది. 
 

iPhone 16 సిరీస్ రాకతో Apple తన మునుపటి మోడల్‌లలో కొన్నింటి ధరలను తగ్గించింది. వీటిలో iPhone 15, iPhone 15 Plus, iPhone 14, iPhone 14 Plus ఉన్నాయి. ఈ మోడల్‌లపై రూ. 10,000 తగ్గింపు ఇస్తోంది. 
 

Latest Videos


iPhone 15 సిరీస్ ప్రస్తుతం రూ.79,900 ధర పలుకుతోంది. ఈ ఫోన్ పై ఇప్పుడు నేరుగా రూ.10 వేలు తగ్గింపు ప్రకటించారు. అంటే iPhone 15 కేవలం రూ.69,900 లకు లభిస్తుందన్న మాట. అదేవిధంగా iPhone 15 Plus కూడా రూ.10 వేలు తగ్గించి అమ్ముతున్నారు. గత ఏడాది ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు దీని ధర రూ.89,900 ఉంది. రూ.10,000 తగ్గింపుతో ఈ ఫోన్ కేవలం రూ.79,900కి లభిస్తుంది. 
 

iPhone 14 ధరలు కూడా ఇదే విధంగా తగ్గాయి. అంటే iPhone 14 గతంలో రూ.69,900 ఉండగా, ఇప్పుడు రూ.59,900లకు లభిస్తుంది. iPhone 14 Plus రూ.79,900 ఉండగా రూ.69,900 కే విక్రయిస్తారు. ఈ తగ్గింపు ధరలు ఆపిల్ అఫీషియల్ వెబ్ సైట్ లోనే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇతర ఇ-కామర్స్ వెబ్ సైట్లలో మరింత తక్కువకు వచ్చే అవకాశాలుంటాయి. వినియోగదారులు పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చు.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ఇకపై Apple వెబ్‌సైట్‌లో అమ్మకానికి లేవు. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన దుకాణాల్లోనే ఉంటాయి.  

మీడియా కథనాల ప్రకారం Apple కొంతమంది కస్టమర్‌లకు వర్తించేలా డిస్కౌంట్లు ప్రకటించింది. తన వినియోగదారులను ఇతర ఫోన్ల వైపు వెళ్లనీయకుండా ఆపిల్ కంపెనీ ఇలాంటి విధానాలు అమలు చేస్తూ ఉంటుంది. ఈ విధానం కారణంగా ఇటీవల iPhone 15, iPhone 15 Plus, iPhone 14, iPhone 14 Plus కొనుగోలు చేసిన కస్టమర్‌లు ధర తగ్గింపు తర్వాత రీఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. లేదా క్రెడిట్‌ స్కోర్ సాధించేందుకు అర్హులు కావచ్చు. ఆ అర్హత పొందాలంటే, కస్టమర్‌లు ధర తగ్గింపు ప్రకటనకు 14 రోజుల ముందుగా iPhone 15, iPhone 14 ఫోన్లు కొనుగోలు చేసి ఉండాలి.

ధర తేడాకు రీఫండ్ లేదా క్రెడిట్ స్కోర్ పొందడానికి, కస్టమర్‌లు తమ అసలు రసీదు తీసుకొని దగ్గరలోని Apple స్టోర్‌ను సందర్శించవచ్చు. లేదా 000800 040 1966లో Apple కస్టమర్ సేవా నంబర్‌కు కాల్ చేయవచ్చు. 14 రోజుల వ్యవధిలోపు కొనుగోళ్లు చేసిన కస్టమర్‌లకు మాత్రమే రీఫండ్ వర్తిస్తుంది. ప్రత్యేక అమ్మకాల ఈవెంట్‌లు, తాత్కాలిక ధర తగ్గింపులకు ఇది వర్తించదు.

click me!