బాలీవుడ్ నటి అలియా భట్‌కు చెందిన కంపెనీని ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ కంపెనీ కొనుగోలు చేసింది. అలియా భట్ యాజమాన్యంలోని ఎడ్-ఎ-మమ్మాలో 51% వాటాను కొనుగోలు చేసింది. ఈ భాగస్వామ్యం గురించి అలియా భట్ స్వయంగా ట్వీట్ చేసింది.
నటి అలియా భట్ స్థాపించిన కిడ్ అండ్ మెటర్నిటీ వేర్ బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మాలో 51% వాటాను కొనుగోలు చేయడానికి జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.