తండ్రిలాగా ఎలాంటి మేకప్ లేకుండా ఎంత సింపుల్ గా ఉందొ చూసారా.. నెటిజన్స్ ఫిదా..

First Published | Mar 18, 2024, 5:33 PM IST

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. అందులో, ఇషా అంబానీ తన పిల్లల ప్రీ-స్కూల్  బయట   వెయిట్ చేస్తూ ఉండటం చూడొచ్చు. అంతే కాదు ఇషా ఎలాంటి మేకప్ లేకుండా క్యాజువల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. 
 

అంబానీ కుమార్తె ఇషా అంబానీని ఫ్యాషన్ క్వీన్‌గా పిలుస్తారు ఇంకా ఆమె సెలక్షన్ ఎల్లప్పుడూ హై-ఎండ్ లగ్జరీ లేబుల్‌ల దుస్తులతో నిండి ఉంటుంది. 
 

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్  కోసం ఆమె కస్టమ్ మిస్ సోహీ గౌను అయినా లేదా మైసన్ వాలెంటినో డిజైన్ చేసిన ఆమె వెడ్డింగ్ గోల్డెన్ లెహంగా అయినా, ఇషా ఎప్పుడూ ప్రత్యేకమైన దుస్తులను ధరించడం చూడవచ్చు.
 


ఇషా అంబానీ తన పిల్లల ప్రీ-స్కూల్ బయట  ఎలాంటి మేకప్ లేకుండా క్యాజువల్ డ్రెస్‌లో చాలా సింపుల్‌గా కనిపించడంతో వార్తల్లో నిలిచింది. 
 

ప్రీ-స్కూల్ నుండి బయటి వచ్చే  తన పిల్లలు కోసం ఓపికగా వేచి ఉన్న ఇషా అంబానీ తాను సాధారణ తల్లిలాగ నిరూపించుకుంది.
 

 ఇషా అంబానీ తన సింపుల్ లుక్ లో  మేకప్ లేకుండా అండ్  ఎటువంటి సిబ్బంది లేదా సెక్యూరిటీ  లేకుండా పిల్లల కోసం ప్రీస్కూల్ బయట  వేచి ఉండటం వంటి సాధారణ జీవనం అండ్  ఉన్నత ఆలోచనలకు గొప్ప ఉదాహరణ. 
 

ఇషా అంబానీ తన కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన పిల్లలతో గడపడానికి సమయాన్ని వెచ్చిస్తున్నప్పటికీ ఆమె తల్లిగా తన విధులకు ప్రాధాన్యతనిస్తుంది.
 

ఇప్పుడు  ఇషా  సింపుల్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు అండ్ ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మేకప్ లేకుండా తన తండ్రిలాగా  కనిపిస్తున్నాదని అభిమానులు అంటున్నారు. 
 

ఇషా అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. ఇషా నవంబర్ 19, 2022న కవలలు కృష్ణ అండ్ ఆదియాలకు తల్లి అయ్యింది.
 

Latest Videos

click me!