1.ఉచిత ఆహారం…
రైలు టికెట్ కొన్నందుకు మనం ఉచిత భోజనం పొందవచ్చు. అయితే.. మీరు రాజధాని, దుంతో, శతాబ్ధి వంటి ప్రీమియం ట్రైన్ లోనే ప్రయాణించాలి. అక్కడ కూడా ఒక కండిషన్ అప్లై అవుతుంది. కనీసం రెండు గంటలు రైలు ఆలస్యం అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ఉచితంగా భోజనం అందుతుంది. మీరు ఏదైనా మంచి ఆహారం తినాలి అనుకుంటే.. ఈ కేటరింగ్ సేవ ద్వారా ఫ్రీగగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
2.ఉచిత బెడ్ షీట్…
భారతీయ రైల్వే సుదూర ప్రయాణం కోసం ఏసీ1, ఏసీ2, ఏసీ3 కోచ్ లలో తన ప్రయాణీకులకు ఒక దుప్పటి, ఒక దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక టవల్ ను ఇస్తారు. కానీ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో దీనికి రూ.25 చెల్లించాలి. ఇది కాకుండా, కొన్ని రైళ్లలో ప్రయాణీకులు స్లీపర్ క్లాస్ లో స్లీపింగ్ వసతి కూడా పొందవచ్చు.