Airtel నెట్‌వర్క్‌లో ఇంత మంచి ఆఫర్లు ఉన్నాయా?

First Published Sep 21, 2024, 4:11 PM IST

Airtel టెలికాం సంస్థ తన వినియోగదారుల కోసం మళ్లీ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు రూ.26 నుండి ప్రారంభమై ఒక సంవత్సరం వ్యాలిడిటీ వరకు అందుబాటులో ఉన్నాయి. అన్ లిమిటెడ్ కాల్‌లు, డేటా, SMS సేవలతో కూడిన వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

దేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ అయిన ఎయిర్‌టెల్ తన టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ముందుగా రిలయన్స్ జియో జూలైలో రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. దీని తర్వాత ఎయిర్‌టెల్, Vi కూడా తమ టారిఫ్ ప్లాన్‌లను పెంచాయి. దీనికి తోడు బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరలు పెంచకపోవడం, 4జీ, 5జీ సర్వీసులను పెంచడానికి చర్యలు తీసుకోవడంతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ లోకి మారడం ప్రారంభించారు. ఇలా ఇప్పటికే లక్షల మంది ఇతర నెట్ వర్క్ లనుంచి బీఎస్ఎన్ఎల్ లోకి మారిపోయారు. దీంతో ఎయిర్‌టెల్ టెలికాం తన వినియోగదారులను నిలుపుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్‌లు, ప్లాన్‌లను విడుదల చేస్తోంది. వీటిల్లో ఒక సంవత్సరానికి రీఛార్జ్ చేసుకొనే ప్లాన్ అందరినీ ఆకర్షిస్తోంది. 

1 ఇయర్ ప్లాన్..

ఎయిర్‌టెల్ 1 ఇయర్ ప్లాన్ 365 రోజుల వెలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,999. ఇది ఎయిర్‌టెల్ బెస్ట్ టారిఫ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. 365 రోజుల వెలిడిటీతో ఉన్న ఈ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా మీరు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేయవచ్చు. దీనితో పాటు మీరు రోజుకు 100 SMSలను పొందుతారు. ఇది కాకుండా మొత్తం 24 GB ఇంటర్నెట్ డేటా వస్తుంది. తక్కువ డేటా, ఎక్కువ వెలిడిటీ ఉన్న ప్లాన్‌ను కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక అవుతుంది. 

Latest Videos


మరిన్నిసౌకర్యాలు ఇవిగో..

ఎయిర్‌టెల్ 1 ఇయర్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీరు అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. దీని ద్వారా అపోలో 24|7 యాప్ ప్రయోజనాలను మూడు నెలలు ఉచితంగా పొందవచ్చు. ఇది కాకుండా Wynk, Wynk మ్యూజిక్‌లో ఒక ఉచిత హలో ట్యూన్ ఫీచర్‌ను కూడా పొందవచ్చు. ఎయిర్ టెల్ సంస్థ పోర్ట్‌ఫోలియోలో 365 రోజుల వ్యాలిడిటీతో మరిన్ని ప్లాన్‌లు ఉన్నాయి.

అలాగే ఎయిర్‌టెల్ 1 ఇయర్ ప్లాన్ లాంటివే కాకుండా, కొత్త చౌకైన డేటా ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నంబర్‌ను కలిగి ఉంటే మీరు ఈ కొత్త ఎయిర్‌టెల్ డేటా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ డేటా ప్లాన్ ధర రూ. 26.

ఎయిర్‌టెల్ రూ.26 ప్లాన్

మీరు రూ.26 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లోకి గాని, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో గాని వెళ్లి రీఛార్జ్ చేసుకోవాలి. మీరు రూ.26 తో రీఛార్జ్ చేసుకుంటే 1.5 GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ ఒక రోజు. డేటా పరిమితి ముగిసిన తర్వాత ఒక MBకి 50 పైసలు వసూలు చేస్తారు. 

ఎయిర్‌టెల్ ఇతర ప్లాన్లు ఇవిగో..

రూ.99 ప్లాన్ రెండు రోజుల పాటు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది. కానీ FUP పరిమితి 20GBతో వస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.77 ప్లాన్ 5 GB హై-స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ డేటా ప్లాన్ మీ ప్రధాన ప్లాన్ వ్యాలిడిటీ వరకు చెల్లుబాటు అవుతుంది. 

ఎయిర్‌టెల్ రూ.49 ప్లాన్ కూడా అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ డేటా ప్లాన్ 1 రోజు చెల్లుబాటు అవుతుంది. 20 GB FUP పరిమితితో మీరు ఈ ప్లాన్‌ను కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ.33 ప్లాన్ 2GB హై-స్పీడ్ డేటా, 1 రోజు వ్యాలిడిటీని అందిస్తుంది. డేటా ముగిసిన తర్వాత ఒక MBకి 50 పైసలు వసూలు చేస్తారు.

ఎయిర్‌టెల్ రూ.22 ప్లాన్ 1 రోజు వ్యాలిడిటీతో వస్తుంది. 1 GB హై-స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.11 ప్లాన్ 1 గంట మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 గంటలో మీరు 10 GB FUPతో అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. 

click me!