Google Meet -'Take Notes For Me’ ఫీచర్ అదిరిపోయిందిగా

First Published | Aug 29, 2024, 2:01 PM IST

Google Meet 'టేక్ నోట్స్ ఫర్ మీ' అనే కొత్త AI ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇది మీటింగ్ నోట్‌లను ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేస్తుంది. షేర్ కూడా చేస్తుంది. ఈ ఫీచర్‌ అదిరిపోయిందంటూ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

వీడియో కాల్ నుండి నోట్స్ తీసుకోవడానికి Google Meet 'టేక్ నోట్స్ ఫర్ మీ' అనే జెమినీ AI-ఆధారిత ఫీచర్‌ను రూపొందించింది. ఈ కొత్త అప్‌డేట్‌ను టెక్ దిగ్గజం Google గత సెప్టెంబర్‌లో ప్రకటించినప్పటికీ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. అది కూడా ఎంపిక చేసిన Google Workspace యూజర్‌లకు మాత్రమే. 
 

టేక్‌ నోట్స్‌ ఫర్‌ మీ ఫీచర్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్‌ మీట్‌ ఉపయోగిస్తున్న వారు చెబుతున్నారు. ఎందుకంటే మీటింగ్‌ జరిగే సమయంలో ఇంపార్టెంట్‌ పాయింట్లు రాసుకుంటూ ఉంటే సమావేశం సజావుగా ముందుకు సాగదు. అందువల్ల ఈ ఫీచర్‌ ఆటోమెటిక్‌గా నోట్స్‌ ప్రిపేర్‌ చేస్తుంది కనుక ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాన్సన్‌ట్రేషన్‌తో మీటింగ్‌లో పాల్గొనవచ్చని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. 


టేక్‌ నోట్స్‌ ఫర్‌ మీ ఫీచర్‌ AI-ఆధారిత సాధనం. మీటింగ్స్‌లో పాయింట్లన్నింటినీ దానికదే తీసుకుంటుంది. ఇది మీటింగ్‌లో ఉన్న ఇతరులతోనూ కొలాబరేట్‌ అవ్వడానికి సహాయపడుతుంది. మీటింగ్‌లో స్పీకర్‌ చెబుతున్న ప్రతి పాయింట్‌ని రికార్డ్ చేయడమే కాకుండా దానికదే సేవ్ చేస్తుంది. మనం కావాలనుకుంటే ఇతర సభ్యులతోనూ ఆ పాయింట్లు షేర్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. ఇది మీటింగ్‌కు 
ఆలస్యంగా వచ్చిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. 
 

Google సంస్థ ఏం చెప్పిందంటే.. "సమావేశంలో పాల్గొన్నప్పడు నెక్స్ట్‌ పాయింట్ల గురించి ఆలోచిస్తుంటాం. ఈ క్రమంలో చెప్పిన పాయింట్లు మళ్లీ మళ్లీ చెప్పే అవకాశం ఉంటుంది. టేక్‌ మీ నోట్స్‌ ఫర్‌ మీ ఆప్షన్‌ వల్ల ఆ ఇబ్బంది ఉండదు అని గూగుల్‌ తెలిపింది. ఇది మీటింగ్ ట్రాన్‌స్క్రిప్ట్‌లు, రికార్డింగ్‌లకు లింక్‌లను కూడా అందిస్తుంది.
 

టేక్ నోట్స్ ఫర్‌ మి ఆప్షన్‌ ఎక్కడ ఉందో తెలుసా
Google Meet యాప్ లో స్క్రీన్ కుడి ఎగువ మూలలో 'Take notes with Gemini' ఆప్షన్‌ ఉంటుంది. ఎంచుకోండి. మీటింగ్‌ హాజరైన వారందరికీ ఈ విషయం అర్థమవుతుంది. సమావేశం తర్వాత మీ నోట్స్‌ ను పరిశీలించండి.
 

Latest Videos

click me!