Cheapest SUV: ఆరు లక్షల రూపాయలలో వచ్చే 3 బెస్ట్ బడ్జెట్ ఎస్‌యూవీ కార్లు

Published : Jul 13, 2026, 12:38 PM IST

Cheapest SUV:  మీకు ఎస్‌యూవీ కారు ఇష్టమా.. అయితే కేవలం ఆరు  లక్షల రూపాయల ధరలోనే వచ్చే SUV కార్లు గురించి ఇక్కడ ఇచ్చాము.  మార్కెట్లో కొన్ని మోడల్స్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూడు కార్ల ఫీచర్లు చూసేయండి.

PREV
13
నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ కారు చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది ఇండియాలో అత్యంత చవకైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,73,400. ఇది 1.0-లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 17.4 నుంచి 19.7 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీలో ఈ కారుకు 4-స్టార్ NCAP రేటింగ్ కూడా ఉంది. మధ్యతరగతి వారు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది లోన్ కట్టుకోవచ్చు.

23
టాటా పంచ్

టాటా పంచ్ కారుకు అభిమానులు ఎక్కువ. ఈ కారు ప్రారంభ ధర రూ.5,69,990. ఇది 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంది. పెట్రోల్‌పై 18.8 నుంచి 20 కి.మీ/లీ, CNGలో 26.9 కి.మీ/కిలో మైలేజ్ ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 90-డిగ్రీల వరకు తెరుచుకునే డోర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడం దీని అతిపెద్ద బలం.

33
హ్యుందాయ్ ఎక్స్‌టర్

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా చూసేందుకు అట్రాక్టివ్ గా ఉంటుంది.  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,80,600. 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ SUV, CNG వేరియంట్‌లో 27.1 కి.మీ/కిలో వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్ వంటి ఫీచర్లను అందిస్తున్న ఏకైక మోడల్‌గా ఇది ప్రత్యేకతను చాటుకుంది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories