ఆహా.. 2025లో ఇన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయా? ఉద్యోగులు, విద్యార్థులకు పండగే

First Published | Nov 12, 2024, 6:16 PM IST

కళ్లు మూసి తెరిచే లోగా 2024 సంవత్సరం పూర్తయినట్టు ఉంది కదా.. అసలు ఈ ఏడాదిలో ప్రత్యేకంగా ఏం చేశామంటే చెప్పడానికి గుర్తే రావడం లేదు. అయితే 2025 అలా ఉండదు. ఎందుకంటే ఆ సంవత్సరంలో ఎక్కువ లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. త్వరలోనే 2025 సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ ఏడాదిలో ఎన్ని లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి? ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

2024 సంవత్సరం త్వరలో ముగియనుంది. వచ్చే సంవత్సరం అంటే 2025 కోసం సెలవులను ప్లాన్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ట్రిప్‌లపై ఆసక్తి ఉన్నవారికి 2025 ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకోండి. 

2025 సంవత్సరంలో 12 లాంగ్ వీకెండ్‌లు వస్తాయి. ప్రజలంతా ఈ సెలవులను కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా ఎంప్లాయిస్ కి 2025 లాంగ్ వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆఫీస్ కి సెలవు పెట్టక్కర లేకుండా లాంగ్ టూర్స్ వేయొచ్చు.

2025 సంవత్సరంలో లాంగ్ వీకెండ్‌ల లిస్ట్ ఇక్కడ ఉంది. దీని ద్వారా మీరు మీ సెలవులను బాగా ప్లాన్ చేసుకోవచ్చు.

జనవరి లాంగ్ వీకెండ్

11 జనవరి (శనివారం)
12 జనవరి (ఆదివారం)
13 జనవరి (సోమవారం - భోగి)
14 జనవరి (మంగళవారం - సంక్రాంతి)
15 జనవరి (బుధవారం - కనుమ)

మార్చి నెలలో 2 లాంగ్ వీకెండ్స్

మొదటి లాంగ్ వీకెండ్
14 మార్చి (శుక్రవారం – హోలీ)
15 మార్చి (శనివారం)
16 మార్చి (ఆదివారం)

రెండవ లాంగ్ వీకెండ్
29 మార్చి (శనివారం)
30 మార్చి (ఆదివారం)
31 మార్చి (సోమవారం – ఈద్)


ఏప్రిల్ నెలలో కూడా 2 లాంగ్ వీకెండ్స్ వస్తాయి
మొదటి లాంగ్ వీకెండ్
10 ఏప్రిల్ (గురువారం – మహావీర్ జయంతి)
11 ఏప్రిల్ (శుక్రవారం – మీరే సెలవు తీసుకోవచ్చు)
12 ఏప్రిల్ (శనివారం)
13 ఏప్రిల్ (ఆదివారం)

రెండవ లాంగ్ వీకెండ్
18 ఏప్రిల్ (శుక్రవారం - గుడ్ ఫ్రైడే)
19 ఏప్రిల్ (శనివారం)
20 ఏప్రిల్ (ఆదివారం)

మే నెలలో వచ్చే లాంగ్ వీకెండ్
10 మే (శనివారం)
11 మే (ఆదివారం)
12 మే (సోమవారం - బుద్ధ పూర్ణిమ)

ఆగస్టు నెల లాంగ్ వీకెండ్
15 ఆగస్టు (శుక్రవారం – స్వాతంత్ర్య దినోత్సవం)
16 ఆగస్టు (శనివారం - జన్మాష్టమి)
17 ఆగస్టు (ఆదివారం)

సెప్టెంబర్ లాంగ్ వీకెండ్
5 సెప్టెంబర్ (శుక్రవారం ఓణం) మీరు సెలవు తీసుకోవచ్చు.
6 సెప్టెంబర్ (శనివారం)
7 సెప్టెంబర్ (ఆదివారం)

అక్టోబర్‌లో వచ్చే 2 లాంగ్ వీకెండ్స్
మొదటి లాంగ్ వీకెండ్
1 అక్టోబర్ (బుధవారం – మహానవమి)
2 అక్టోబర్ (గురువారం – దసరా, గాంధీ జయంతి)
3 అక్టోబర్ (శుక్రవారం)మీరు సెలవు తీసుకోవచ్చు.
4 అక్టోబర్ (శనివారం)
5 అక్టోబర్ (ఆదివారం)

రెండవ లాంగ్ వీకెండ్
18 అక్టోబర్ (శనివారం)
19 అక్టోబర్ (ఆదివారం)
20 అక్టోబర్ (సోమవారం - దీపావళి)

డిసెంబర్ నెల లాంగ్ వీకెండ్
25 డిసెంబర్ (గురువారం - క్రిస్మస్)
26 డిసెంబర్ (శుక్రవారం)
27 డిసెంబర్ (శనివారం)
28 డిసెంబర్ (ఆదివారం)

ఇంకెందుకు ఆలస్యం 2025 సెలవులను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. 

Latest Videos

click me!