దేశంలో నకిలీ నోట్ల చలామణి విపరీతంగా పెరిగిపోయిందనడానికి ఇటీవల వెలుగుచూసిన సంఘటనలే ఉదాహరణ. కొన్ని చోట్ల నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తుంటే తెలంగాణలో మాత్రం కొత్తరకంగా మోసానికి పాల్పడుతున్నారు. ఆ మోసం ఏమిటి? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
మార్కెట్లో నకిలీ నోట్లను అరికట్టడానికి, విదేశాల నుండి నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని పెద్ద నోట్లను రద్దు చేసింది.
2016 నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా 2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే కేంద్రం ఆశించిన ఫలితం రాకపోవడంతో 2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న మొదటిసారి ప్రకటించింది. అప్పటి నుంచి రెండు, మూడు సార్లు గడువు ఇచ్చి ఆ నోట్లను వెనక్కు తీసుకుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని వెనక్కు ఇచ్చేలా ప్రజలకు అవగాహన కూడా కనిపించింది.
కరెన్సీ నోట్లనే కాకుండా కాయిన్స్ ని కూడా వేరే పనులకు అక్రమార్కులు వాడుతున్నారు. చిల్లరను భారీగా సేకరించి బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వాటితో కత్తులు తయారు చేస్తున్నారట. అందుకే ఆర్బీఐ పాత నోట్లు, కాయిన్స్ స్థానంలో కొత్త కరెన్సీని విడుదల చేస్తోంది.
రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొత్తగా ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలింది. అయితే కొత్త నోట్లకు కూడా నకిలీవి తయారు చేసేస్తున్నారు. ఇప్పటికే రూ.500 నోట్లు నకిలీవి చలామణిలో ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
నకిలీ రూ.500 నోట్లను కనిపెట్టే సూచనలు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన రూ.200 నోట్లను కూడా పేక్ చేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణంలో నకిలీ రూ.200 నోట్ల ఉదంతం వెలుగుచూసింది. ఈ ఫేక్ నోట్లను మోసగాళ్లు కేవలం వస్తువులు కొనడానకి మాత్రమే ఉపయోగిస్తున్నారట. అందువల్ల ఎక్కడైన రూ.200 నోటు మీకు వచ్చినా, ఇప్పటికే మీ దగ్గర ఉన్నా ఒకసారి మొత్తం చెక్ చేయండి. అది ఫేక్ అని అనుమానమొస్తే తీసుకోకండి.
ఇప్పటికే మీ దగ్గర రూ.200 నోటు ఉన్నా, మార్కెట్లో ఎవరైనా ఇచ్చినా వెంటనే దాన్ని క్లియర్ గా పరిశీలించండి.
నకిలీ రూ.200 నోటు కాస్త మందంగా ఉంటుంది. సాధారణ రూ.200 నోటులా ఉండదు. ఎందుకంటే రూ.200 నోట్లను కలర్ జిరాక్స్ తీయించి చలామణి చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఫేక్ నోట్లే విడుదల అయ్యాయి. అందువల్ల మీరు తీసుకున్న నోట మందంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.