మీరు పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ పథకంతో రూ.2.50 లక్షలు పొందవచ్చు.. ఎలానో తెలుసుకోండి..

First Published Jan 11, 2022, 1:58 PM IST

నేటికీ మన దేశంలో చాలా మంది కులాంతర వివాహాలను(intercaste marriage) చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి పెళ్లిలని తప్పుడు కళ్లతో చూడకుండా వాళ్లకు కాస్త అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం యువతీ, యువకులు కులాంతర వివాహాల కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. 

 ఈ కారణంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఇంకా సమాజంలో వ్యాపించిన చెడు ఆలోచనను తొలగించడానికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంది, దీని ప్రకారం మీరు పెద్దవారై కులాంతర వివాహం చేసుకోవాలనుకుంటే మీకు  ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించబడుతుంది. అవును, ఇది పూర్తిగా నిజం. ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ గురించి తెలుసుకోండి దీని ద్వారా మీరు ఆర్ధిక సహాయం పొందవచ్చు. కాబట్టి దాని గురించి తెలుసుకుందాం...

ఈ విధంగా మీరు ఈ పథకంతో  ప్రయోజనాన్ని పొందుతారు
ఈ పథకాన్ని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అని పిలుస్తారు, దీని కింద మీకు రూ.2 లక్షల 50 వేల ఆర్థిక సహాయంగా లభిస్తుది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఈ విషయాలను గుర్తుంచుకోవాలి:-
1. ఈ పథకం ప్రయోజనం కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వారిలో ఒకరు దళిత వర్గానికి చెందిన వారు కాగా, మరొకరు దళిత వర్గానికి చెందని వారు అయి ఉండాలి.

2. అలాగే వారి వివాహాన్ని హిందూ వివాహ చట్టం 1995 కింద రిజిస్టర్ చేయాలి. ఇందుకు అఫిడవిట్ పెట్టడం ద్వారా చేయవచ్చు.

3. ఈ పథకం ప్రయోజనం మొదటిసారి వివాహం చేసుకున్న కొత్త జంటలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండవ లేదా అంతకంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు.

4. వివాహం తర్వాత మీరు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే పెళ్లయిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
 

click me!