2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర క్రియేట్ చేసిన గుత్వా జ్వాల... 2005లోనే తన సహచర ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆరేళ్లకే వీరి బంధం పెటాకులైంది...
మనస్ఫర్థల కారణంగా 2011లో చేతన్ ఆనంద్‌తో విడాకులు తీసుకుని, వేరుపడింది భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల... ఆ తర్వాత గుత్తా జ్వాల గురించి చాలా పుకార్లు వినిపించాయి..
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌తో గుత్తా జ్వాల డేటింగ్ చేస్తోందని వార్తలు వెలువడ్డాయి. కానీ జ్వాల మాత్రం ఈ విషయంపై స్పందించలేదు...
కామన్ ఫ్రెండ్స్ ద్వారా గుత్తా జ్వాలకి విష్ణు విశాల్‌కి మధ్య పరిచయం ఏర్పడింది... గుత్తా జ్వాలతో ప్రేమాయణం ఎలా మొదలైందో చెప్పుకొచ్చాడు ‘రత్నాసన్’ హీరో విష్ణు విశాల్...
‘తనకి ప్రపోజ్ చేయడానికి ముందు తనతో నాకు ఏడాదిన్నరగా పరిచయం ఉంది. మా ఇద్దరికీ చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేమిద్దరం కూడా ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాం...
అలా మా మధ్య ఏర్పడిన పరిచయం కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారింది... మేమిద్దం కూడా ఒకరినొకరం వ్యక్తిగతంగా ఇష్టపడతాం... అయితే రిలేషన్‌షిప్‌లో వెళ్లేముందు చాలా ఆలోచించాం...
మేం కలిసి పార్టీలకు వెళ్తున్న ఫోటోలు, వైరల్ అయ్యాయి. మేమిద్దం డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయానికి మా ఇద్దరికీ అలాంటి ఆలోచన రాలేదు...
2019లో తన బర్త్‌డే రోజున ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా.. సర్‌ప్రైజ్ ఇవ్వడం కంటే, నా ప్రేమను బయటపెట్టడానికి అదే కరెక్ట్ సమయం అనిపించింది...
ఆ రాత్రి, బర్త్ డే విషెస్ చెప్పడానికి వెళ్లి, ప్రపోజ్ చేసేశాను... తను వెంటనే ‘ఎస్’ చెప్పేసింది...’ అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్...
‘మేం ఇద్దరం అప్పటివరకూ చాలా సీరియస్ రిలేషన్‌లో ఉన్నామని తెలుసు... కాని తను నా బర్త్ డే రోజు అలా ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదు... అది నిజంగా నాకు చాలా స్పెషల్ సర్‌ప్రైజ్... ఓ కలలా అనిపించింది’ అంటూ చెప్పింది గుత్తా జ్వాల...
2020లో గుత్తా జ్వాల బర్త్ డే రోజున గుత్తా జ్వాలతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు విష్ణు విశాల్...
‘హ్యాపీ బర్త్ డే గుత్తా జ్వాల... కొత్త జీవితం మొదలెట్టేద్దాం... మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్నవాళ్లు... మీ అందరి దీవెనలు కావాలి...’ అంటూ ఎంగేజ్‌మెంట్‌తో రింగ్‌తో ఉన్న ఫోటోలను పోస్టు చేశాడు విష్ణు విశాల్...
గుత్తా జ్వాల హైదరాబాద్‌లో ఉంటే, విష్ణు విశాల్ చెన్నైలో ఉంటాడు. సమయం దొరికినప్పుడల్లా కలుసుకునే సమయం గడిపేవాళ్లంట గుత్తా జ్వాల, విష్ణు విశాల్...
అయితే 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించిన తర్వాత మిగిలిన జంటల్లాగే వీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారట. కేవలం వీడియో కాల్స్‌లోనే చూసుకుంటూ, విరహ వేదన అనుభవించారట ఈ జంట..
‘విశాల్‌ను చూసి మూడు వారాలు అవుతోంది. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న మేం, ఇన్నాళ్లు ఒకరినొకరం కలుసుకోకపోవడం ఇదే తొలిసారి...’ అంటూ పోస్టు చేసింది గుత్తా జ్వాల...
నాలుగు నెలల తర్వాత చెన్నై చేరిన గుత్తా జ్వాల.... విష్ణు విశాల్‌కి సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది... ఎన్నో అవాంతరాలను దాటి, ప్రియుడి ఇంటికి చేరుకున్న జ్వాలను కూడా సర్‌ప్రైజ్‌తో పాటు షాక్ అయ్యాడట విష్ణు విశాల్...
భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల వయసు 37 ఏళ్లు కాగా... విష్ణు విశాల్ ఆమె కంటే ఏడాది చిన్నవాడు కావడం విశేషం...
గుత్తా జ్వాల, నితిన్ హీరోగా వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేయగా... కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, రానాతో కలిసి ‘అరణ్య’ సినిమాలో నటించాడు.