తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. లాంగ్ రైడ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే, బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి స్టైల్ తో పాటు కంఫర్ట్ గా కూడా ఉంటాయి. మరి ఆలస్యమెందుకు ఓ లుక్కేయండి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బైక్ తప్పనిసరి అయింది. చాలామంది తమకు నచ్చిన వాళ్లతో బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్లాలనుకుంటారు. లేదా ఉద్యోగాలు, పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తుంటారు. అయితే పెట్రోల్ ఖర్చులు, నడుము నొప్పి వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతుంటాయి. అలాంటి వారికోసం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి, ఎంత దూరమైనా కంఫర్ట్ గా ప్రయాణించగలిగే బైక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో, వాటి ఫీచర్లు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
బజాజ్ ప్లాటినా 110
లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి బజాజ్ ప్లాటినా 110 బెస్ట్ ఆప్షన్. దీనిలోని 'కంఫర్ట్' టెక్నాలజీ నడుం నొప్పి రాకుండా చూసుకుంటుంది. పొడవైన, మెత్తటి సీటు ప్రయాణంలో వచ్చే కుదుపులను తగ్గిస్తుంది. గతుకుల రోడ్లపై కూడా స్మూత్‌గా వెళ్లొచ్చు. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 నుంచి 75 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.72,000 నుంచి మొదలవుతుంది.
36
టీవీఎస్ రేడియాన్ బైక్
టీవీఎస్ రేడియాన్ బైక్, దాని రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటుంది. దీని సీటు చాలా వెడల్పుగా, కుషనింగ్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ప్రయాణించడానికి ఇది మంచి మోడల్. ఇందులో సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (SBT) ఉండటంతో భద్రత ఎక్కువ. ఎక్కువసేపు నడిపినా కాళ్లు, నడుముపై ఒత్తిడి పడదు. ఇది 70 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.78,000 వరకు ఉంటుంది.
ఈ బైక్‌లోని 125cc మోడల్ లాంగ్ జర్నీకి సూపర్ గా సెట్ అవుతుంది. 100cc మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీన్ని నడుపుతున్నప్పుడు వైబ్రేషన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట, నడుం నొప్పి ఉండవు. హోండా షైన్ ఇంజిన్ చాలా సైలెంట్‌గా ఉంటుంది. స్మూత్ గేర్ షిఫ్టింగ్ వల్ల రైడింగ్ ఈజీగా ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఈ బైక్ 65 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.85,000 వరకు ఉంటుంది.
56
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
మైలేజ్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బెస్ట్ ఛాయిస్. దీనిలోని సెమీ-డిజిటల్ క్లస్టర్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ గతుకుల రోడ్లపై కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. తక్కువ బరువు ఉండటం ఈ మోడల్ స్పెషాలిటీ. అందుకే ట్రాఫిక్‌లో, హైవేలపై నడపడం సులభం. ఈ మోడల్ 70 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.78,000 వరకు ఉంటుంది.
66
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R
బడ్జెట్ ధరలో ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్ రెండూ అందించే బెస్ట్ 125cc బైక్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R. స్పోర్టీ లుక్‌లో ఉండే ఈ మోడల్ రైడింగ్ పొజిషన్‌ను నడుం నొప్పి రాకుండా డిజైన్ చేశారు. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 66 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.95,000 వరకు ఉంటుంది.