టాటా మోటార్స్‌ కొత్త ఎడిషన్‌ కార్లు : టాటా సైన్‌ బ్యాడ్జ్‌తో ప్రత్యేకంగా వారికి మాత్రమే..

First Published | Feb 4, 2021, 3:58 PM IST

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత మార్కెట్లో 75 వసంతలను పూర్తి చేసుకుంది. ఈ సంస్థను 1945 లో  జే‌ఆర్‌డి టాటా  స్థాపించారు. ఈ సంస్థ ప్రారంభంలో  లోకోమోటివ్లను తయారు చేసింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ప్రస్తుతం ఉన్న అన్ని మోడళ్లపై  'ఫౌండర్స్ ఎడిషన్' పేరుతో ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేసింది, అయితే  ఈ కార్లను అందరూ  కొనుగోలు చేయలేరు. 

అవును నిజమే... ఎందుకంటే టియాగో, టైగర్, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ వంటి స్పెషల్ ఎడిషన్లను టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా లాంచ్ చేశారు. ఈ అన్నీ మోడళ్లలో ఫౌండేర్ ఎడిషన్‌ను మాత్రమే వారు కొనుగోలు చేయవచ్చు. అయితే దాని ప్రత్యేకత ఏమిటంటే ? కొన్ని చిన్న అప్ డేట్ తో పాటు, ప్రతి ;ఫౌండర్స్ ఎడిషన్' కారు పై జే‌ఆర్‌డి టాటా సంతకంతో ఉన్న ప్రత్యేక బ్యాడ్జ్‌తో వస్తుంది.
ఈ ఐదు మోడళ్ళు కొత్త లోగోతో, జే‌ఆర్‌డి టాటా సంతకం బ్యాక్ గ్రౌండ్ నీలిరంగుతో వస్తుంది. ఇక బ్యాడ్జ్ విషయానికొస్తే, మొత్తం 5 కార్లపై నాలుగు చోట్ల జే‌ఆర్‌డి టాటా సంతకం ఉంటుంది. ఒకటి చక్రం పైన ఉన్న ఫ్రంట్ ఫెండర్‌పై, సి-పిల్లర్ పై ఒకటి, టెయిల్‌గేట్‌లో ఒకటి, చివరిది డాష్‌బోర్డ్ పైన. ఈ కార్లను కొనుగోలు చేసే టాటా గ్రూప్ ఉద్యోగులకు ఫోటో ఫ్రేమ్‌తో పాటు బ్రాండ్ జౌర్నే ని వివరించే ఐకానిక్ సిరీస్ నుండి పోస్ట్‌కార్డ్ కూడా లభిస్తుంది.

మెకానికల్ గా అన్ని కార్లు ఒకే ఇంజన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉంటాయి. టియాగో టైగోర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆప్షనల్ ఏ‌ఎం‌టి యూనిట్‌తో వస్తుంది. ఆల్ట్రోజ్‌కు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తాయి, ఒకటి న్యాచురల్, మరొకటి టర్బోచార్జ్డ్ యూనిట్, మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌. వీటికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ అందించారు.
నెక్సాన్ విషయానికొస్తే, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ వస్తుంది, రెండూ 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్ బాక్స్ ఉంటుంది లేదా ఆప్షనల్ ఏ‌ఎం‌టి యూనిట్‌తో వస్తుంది. మరోవైపు, హారియర్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌తో వస్తుంది.
జనవరి 2021 చివరిలో టాటా టియాగో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది, ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా, టాటా టియాగో స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో బ్లాక్ అల్లాయ్ వీల్స్, 5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ కారును 5.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) వద్ద ప్రారంభించారు, ఇది టియాగో స్టాండర్డ్ ఎక్స్‌టి వేరియంట్ కంటే రూ.30,000 ఎక్కువ.

Latest Videos

click me!