కొత్త బోల్డ్ లుక్ తో ఎట్టకేలకు సుజుకి ఎస్-క్రాస్ కొత్త జనరేషన్ ఎస్‌యూ‌వి వచ్చేస్తోంది..

First Published | Nov 26, 2021, 4:04 PM IST

 జపనీస్ మల్టీనేషనల్ కార్పొరేషన్ సుజుకి ఎట్టకేలకు సుజుకి ఎస్-క్రాస్ 2022 (suzuki s-cross 2022) ఎస్‌యూ‌వి కారుని పరిచయం చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా మారిన కొత్త డిజైన్‌తో వచ్చింది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత మోడల్‌తో పోలిస్తే కొత్త సుజుకి ఎస్-క్రాస్ చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది.

మారుతి సుజుకి  ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ అయిన నెక్సా ద్వారా క్రాస్ఓవర్ భారతీయ మార్కెట్లో ప్రీమియం మోడల్‌గా విక్రయించింది. అవుట్‌గోయింగ్ మోడల్ డిజైన్ పరంగా ఆకట్టుకోలేకపోయినందుకు తీవ్రంగా విమర్శించబడింది. అయితే  ఇప్పుడు దీనిపై సుజుకీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొత్త సుజుకి ఎస్-క్రాస్ పాత మోడల్ కంటే బయటి లుక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 

కొత్త లుక్ ఎలా ఉందంటే 
కొత్త సుజుకి ఎస్-క్రాస్ 2022 ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది.  కొత్త బంపర్‌లతో కూడిన పియానో-బ్లాక్ గ్రిల్, కొత్త ట్రిపుల్-బీమ్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీని పొందుతుంది. బానెట్ పాత మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ అండ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లను కూడా పొందుతుంది.

డిజైన్ మార్పులు
సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ బాడీ క్లాడింగ్, స్క్వారీష్ వీల్ ఆర్చ్‌లతో కూడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్డ్ విండో లైన్లు, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. కారు వెనుక భాగం గురించి మాట్లాడితే బంపర్ కొద్దిగా అడ్జస్ట్ చేసింది. కొత్తగా రూపొందించిన ఎల్‌ఈ‌డి టెయిల్‌ల్యాంప్‌లను అందించారు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ పొందుతుంది.


ఫీచర్లు
కొత్త సుజుకి S-క్రాస్ ఎస్‌యూ‌వి 2022 లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, అయితే టాప్ మోడల్ శాటిలైట్ నావిగేషన్‌తో 9.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ యూనిట్‌ను పొందుతుంది. అంతేకాకుండా డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు మోడల్ లైనప్‌లో స్టాండర్డ్ గా ఉంటాయి. టాప్ ట్రిమ్ ప్రత్యేకంగా పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ సీట్ అప్హోల్స్టరీ, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరాతో అందించారు. 

సేఫ్టీ ఫీచర్లు
కొత్త సుజుకి ఎస్-క్రాస్ 2022 మల్టీ డ్రైవర్ ఆసిస్టన్స్ సిస్టంతో వస్తుంది. ముందు ఇంకా వెనుక పార్కింగ్ సెన్సార్లు, ట్రాఫిక్-సైన్ రికగ్నిషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. కొత్త మోడల్ 6 కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. వీటిలో సిల్కీ సిల్వర్, మెటాలిక్ టైటాన్ డార్క్ గ్రే, స్పియర్ బ్లూ, సాలిడ్ వైట్, ఎనర్జిటిక్ రెడ్, కాస్మిక్ బ్లాక్ వంటి రంగులు ఉన్నాయి. 

ఇంజన్ అండ్ పవర్
కొత్త సుజుకి  ఎస్‌యూ‌వి ఆల్‌గ్రిప్ సెలెక్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌లోని డయల్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. కొత్త సుజుకి ఎస్-క్రాస్‌లో 48-వోల్ట్ SHVS మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఇచ్చారు. ఈ ఎస్‌యూ‌వి 1.4-లీటర్ DITC ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 5,500 rpm వద్ద 129 PS శక్తిని, 2000-3000 rpm వద్ద 235 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 13.59 PS పవర్, 50 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.

టాప్ స్పీడ్ 
ఈ ఎస్‌యూ‌వి కేవలం 9.5 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. టాప్ స్పీడ్ 195 kmph. 4WDసిస్టమ్ ఆన్‌తో ఎస్‌యూ‌వి 10.2 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

భారతదేశంలో  లాంచ్ 
ప్రస్తుతం ఎస్-క్రాస్ కొన్ని యూరోపియన్ మార్కెట్లలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఈ మోడల్ ఇండియాకు వస్తుందా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి వార్త లేదు. భారతదేశంలోని ప్రస్తుత జనరేషన్ ఎస్-క్రాస్ మిడ్-సైజ్ ఎస్‌యూ‌వి విభాగంలో హ్యుందాయ్ క్రెటా (hyundai creta), కియా సెల్టోస్ (kia seltos) వంటి కార్లతో పోటీపడుతుంది. మారుతి సుజుకి ఈ మోడల్  అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువస్తే ఈ‌ సెగ్మెంట్‌లోని ఇతర కార్లకు సవాలు విసిరే అవకాశం ఉంది. 

Latest Videos

click me!