ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసు.. నకిలీ హెల్మెట్లు, కుక్కర్లు, సిలిండర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు..
First Published | Nov 25, 2021, 7:21 PM ISTఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి లేదా అందుకుగల కారణమయ్యే నకిలీ ఉత్పత్తుల విక్రయాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది. నకిలీ ఐఎస్‌ఐ స్టాంప్డ్ ప్రెషర్ కుక్కర్లు, టూ వీలర్ హెల్మెట్లు, ఎల్‌పిజి సిలిండర్లను విక్రయిస్తున్న వారిపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది.