ట్రాఫిక్‌లో ప్రయాణించి విసిగిపోయారా..? అయితే ఈ ఫ్లయింగ్ బైక్ తో గాలిలో ప్రయాణించొచ్చు..

First Published | Nov 30, 2021, 8:32 PM IST

కొన్ని దశాబ్దాల క్రితం ఫ్యూచరిజం అండ్ ఇన్నోవేషన్ గురించి ఫాంటసీ కన్వర్జేషన్ లో  'ఎగిరే కార్లు', 'హోవర్‌బైక్‌లు' సాధారణ పదాలు. కాని ఈ రోజు ఆ పదాలు ఆటోమోబైల్ పరిశ్రమకు పెద్ద అడుగులా కనిపిస్తుంది. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా నుండి నేరుగా ఆటోమోటివ్ పరిశ్రమ  ఎగిరే బైక్ తీసుకువస్తే ఎలా ఉంటుంది... ఆటోమోటివ్ మొబిలిటీలో ఇది చాలా కష్టమైన పని.

అయితే  జపనీస్ వాహన తయారీ సంస్థ ఏ‌ఎల్‌ఐ(A.L.I)టెక్నాలజీస్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ బైక్ లేదా XTURISMO లిమిటెడ్ ఎడిషన్‌ హోవర్‌బైక్ ను పరిచయం చేసింది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ వారం  ఎగిరే బైక్  షో నిర్వహించింది, అలాగే దాని వీడియోను కూడా షేర్ చేసింది. ALI టెక్నాలజీస్ కొంతకాలంగా ఎగిరే బైక్‌లను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది అయితే చివరకు ఫుజిలోని రేసింగ్ సర్క్యూట్‌లో  దానిని ప్రదర్శించింది.

ఈ హోవర్‌కు  నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు, పెట్రోల్‌తో పనిచేసే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ శక్తిని ఇస్తుంది. దీని పరిశీలించిన తర్వాత ఎగరాడానికి, నావిగేట్ చేయడానికి ఆరు బ్లేడ్‌లను ఉపయోగిస్తుంది - రెండు పెద్ద బ్లేడ్‌లు ముందు అలాగే వెనుక రెండు వైపులా ఉంటాయి. అయితే ఈ ఫ్లయింగ్ బైక్ గంటకు 100-కిమీ వేగంతో 40 నిమిషాల పాటు ఎగురుతుందని వాగ్దానం చేసింది. హోవర్‌బైక్  టాప్ స్పీడ్ వెల్లడించనప్పటికీ బ్రాండ్ ప్రకారం ఎగరడానికి ఎకానమీ స్పీడ్ 100 గా అనిపిస్తుంది. ఈ ఎగిరే బైక్ కొలతలు పరంగా పొడవు 3.7 మీటర్లు, వెడల్పు 2.4 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లు ఉంటుంది. అయితే సింగిల్-సీటింగ్ సెటప్‌ను మాత్రమే అందిస్తుంది. మొత్తం మీద XTURISMO ఫ్లయింగ్ బైక్ దాదాపు 300 కిలోల బరువు ఉంటుంది.

Tap to resize

"భవిష్యత్తులో ఎయిర్ మొబిలిటీ  విస్తరిస్తుందని అంచనా వేసింది, అయితే అన్నింటిలో మొదటగా ప్రదేశాలు, పర్వత ప్రాంతాలు, సముద్రంలో, విపత్తు సమయాల్లో  ఈ ఎగిరే బైక్ ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు. దీనిని XTURISMO మొదటి దశగా  అలాగే కొత్త లైఫ్ స్టయిల్ లో ఒకటిగా పరిచయం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ఏ‌.ఎల్‌.ఐ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అండ్ సి‌ఈ‌ఓ డైసుకో కటానో (Daisuke Katano) తెలిపారు.

అక్టోబర్ 26 నుంది XTURISMO లిమిటెడ్ ఎడిషన్‌  ప్రీ-బుక్ ప్రారంభం అయ్యాయి, వచ్చే ఏడాది డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే మొత్తంగా  200 హోవర్‌బైక్‌లు మాత్రమే ఉత్పత్తి చేయనుంది. అంటే ఈ బైక్ అరుదైన లగ్జరీగా మిగిలిపోతుంది. 2025 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ హోవర్‌బైక్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  ALI టెక్నాలజీస్ XTURISMO లిమిటెడ్ ఎడిషన్ బైక్ ధర  77.7 మిలియన్ యెన్ అంటే సుమారు రూ. 5.1 కోట్లుగా నిర్ణయించింది.

Latest Videos

click me!