ప్రపంచంలోని మొట్టమొదటి వాహనం: రోడ్డు ఇంకా రైల్వే ట్రాక్ పై కూడా వెళ్లగలదు..

First Published | Dec 29, 2021, 6:55 PM IST

జపాన్ ప్రజల ఉపయోగం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-మోడ్ వాహనం లేదా డి‌ఎం‌వి సేవ(DMV service)ను ప్రారంభించింది. డి‌ఎం‌వి ఒక మినీబస్సులా కనిపిస్తుంది అలాగే  దీనికి సాధారణ రబ్బరు టైర్లను ఉపయోగించి రోడ్లపై నడపవచ్చు. కానీ ఇతర బస్సుల కంటే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లలో యాక్టివేట్ చేసిన స్టీల్ వీల్స్ దీనికి ఉన్నాయి. తద్వారా వాహనం రైలులా రైలు పట్టాలపై కదలడానికి సహకరిస్తుంది.

ప్రత్యేకత ఏముంది 
మీడియా నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే మొట్టమొదటి డి‌ఎం‌వి జపాన్‌లోని కయో నగరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రోడ్లపై నడుస్తున్నప్పుడు  అసాధారణంగా కనిపించకపోయినా కానీ ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లలో  రబ్బరు టైర్‌లకు స్టీల్ వీల్స్ ముందు భూమి నుండి పైకి లేపుతాయి, అయితే వెనుక రబ్బరు టైర్లు డి‌ఎం‌వి ని రైలు ట్రాక్‌పైకి నెట్టివేస్తాయి. 

టాప్ స్పీడ్ 
ఆసా కోస్ట్ రైల్వే ప్రకారం కయోలో ప్రవేశపెట్టబడిన డి‌ఎం‌వి రరోడ్డుపై 100 kmph వేగంతో అలాగే ట్రాక్‌లపై గరిష్టంగా 60 kmph వేగంతో నడుస్తుంది. ఇంకా ఒకేసారి 21 మందిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పవర్ కోసం ఇందులో డీజిల్ ఇంజన్ అమర్చారు. డి‌ఎం‌వి అనేక కలర్ ఆప్షన్స్ లో అందించబడుతోంది. 
 


డి‌ఎం‌వి ప్రయోజనాలు
ఆసా కోస్ట్ రైల్వే జపాన్‌లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు రిమోట్ యాక్సెస్‌ను అందించడంలో సహాయపడటానికి డి‌ఎం‌వి డ్యుయల్ సామర్థ్యానికి మద్దతునిస్తోంది. సి‌ఈ‌ఓ షిగేకి మ్యూర మీడియాతో మాట్లాడుతూ, "డి‌ఎం‌వి స్థానిక ప్రజలను (బస్సు రూపంలో) చేరుకోవచ్చు అలాగే రైల్వేలకు కూడా తీసుకువెళుతుంది."అని అన్నారు.

వృద్ధుల కోసం ప్రత్యేక శ్రద్ధ
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అలాగే ముఖ్యంగా వృద్ధులకు సహాయపడుతుందని సి‌ఈ‌ఓ షిగేకి మియురా అభిప్రాయపడ్డారు. డి‌ఎం‌వి సర్వీస్ దక్షిణ జపాన్‌లోని షికోకు ఐలాండ్ తీరం వెంబడి పాక్షికంగా ప్రయాణికులకు సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. అలాగే పర్యాటకుల నుండి ఆదాయ వనరుగా కూడా మారవచ్చు.
 

Latest Videos

click me!