Fuel Saving Tips : ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. మీ కారు మైలేజ్ పక్కా డబుల్ అవుతుంది

Published : May 22, 2026, 10:47 AM IST

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.. ఈ సమయంలో కారును మంచి మైలేజ్ ఇచ్చేలా మెయింటేన్ చేయడం చాలా ముఖ్యం. మనం చేసే కొన్ని చిన్నచిన్న తప్పులే మైలేజ్ ను తగ్గిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. వాటిని సరిదిద్దుకుని కారు మైలేజ్ ను పెంచుకుందాం. 

PREV
16
కారు మైలేజ్ పెంచుకునే సింపుల్ చిట్కాలివే..

Car Mileage :  పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ తలకిందులవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ఖర్చులు తగ్గించుకోవడం చాలా ముఖ్యం... ఇందులో భాగంగా తమ వాహనాన్ని మంచి మైలేజ్ ఇచ్చేలా మెయింటేన్ చేయాలని చాలామంది కోరుకుంటారు.

అయితే కొందరు కారు పాతదైతే మైలేజ్ తగ్గిపోతుందని అనుకుంటారు… కానీ ఇది నిజం కాదు. కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్లే కారు ఎక్కువ పెట్రోల్/డీజిల్ తాగేస్తుంటుంది. ఒకవేళ మీ కారు కూడా ఎక్కువ ఇంధనాన్ని వాడుతున్నట్లయితే కంగారు పడాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే చాలు, మీ కారు మైలేజ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. కాారు వాడే వాళ్ల జేబుకు చిల్లు పెట్టే ఆ ఐదు తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.

26
1. టైర్లలో గాలి పర్ఫెక్ట్ గా మెయింటేన్ చేయండి..

కారు మైలేజ్‌లో టైర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. టైర్లలో గాలి తక్కువగా ఉంటే, రోడ్డుపై టైర్ల ఒత్తిడి పెరిగి ఇంజిన్‌పై ఎక్కువ భారం పడుతుంది. దీనివల్ల ఇంజిన్ కారును లాగడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే కనీసం వారానికి ఒకసారైనా టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోండి. కంపెనీ సూచించిన స్థాయిలో గాలిని నింపండి. సరైన టైర్ ప్రెజర్ మైలేజ్‌ను పెంచడమే కాకుండా, టైర్ల జీవితకాలాన్ని కూడా పెంచుతుంది.

36
2. టైమ్‌కి సర్వీసింగ్ చేయించుకొండి

వాహనం పాతదైనా, కొత్తదైనా సరే.. ప్రతి కారుకు సరైన సమయంలో సర్వీసింగ్ అవసరం. ఇంజిన్ ఆయిల్ లేదా ఎయిర్ ఫిల్టర్‌ను టైమ్‌కి మార్చకపోతే ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్ వల్ల ఇంజిన్‌కు సరిపడా గాలి అందదు. ఇది ఇంధనం ఎక్కువ ఖర్చవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యం.

46
3. క్లచ్, గేర్లు సరిగ్గా వాడండి..

చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనవసరంగా క్లచ్‌పై కాలు పెట్టి ఉంచుతారు. దీన్నే 'హాఫ్-క్లచ్ డ్రైవింగ్' అంటారు. ఈ అలవాటు కారు భాగాలను పాడుచేయడమే కాకుండా, మైలేజ్‌ను కూడా తగ్గిస్తుంది. అలాగే సరైన సమయంలో గేర్లు మార్చడం కూడా ముఖ్యం. తక్కువ స్పీడ్‌లో ఎక్కువ గేర్‌లో, ఎక్కువ స్పీడ్‌లో తక్కువ గేర్‌లో నడపడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇంజిన్ ఎంత స్మూత్‌గా రన్ అయితే, మైలేజ్ అంత బాగా వస్తుంది.

56
4. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆఫ్ చేయండి

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేదా ట్రాఫిక్ జామ్‌లో 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఆగాల్సి వస్తే, ఇంజిన్‌ను ఆఫ్ చేయడం ఉత్తమం. కారు కదలకుండా ఆగి ఉన్నప్పుడు కూడా ఇంజిన్ ఆన్‌లో ఉంటే ఇంధనం వృధా అవుతుంది. కాబట్టి వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇది పెట్రోల్ ఆదా చేయడమే కాకుండా మైలేజ్‌పై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

66
5. కారులో అనవసరమైన వస్తువులు ఉంచండి

చాలామంది కారు డిక్కీని ఒక స్టోర్ రూమ్‌లా మార్చేస్తారు. బరువైన టూల్స్, అవసరం లేని వస్తువులను డిక్కీలో ఉంచడం వల్ల కారు బరువు పెరుగుతుంది. వాహనం బరువు ఎంత పెరిగితే, ఇంజిన్ దాన్ని లాగడానికి అంత ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి, కారులో కేవలం అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories