స్పష్టం చేసిన పోలీసులు
సినిమా సీక్వెన్స్‌లో విక్కీ కౌశల్ ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్‌కు బోల్ట్ ఫిక్స్ చేయడం వల్ల అపార్ధం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం ఫిర్యాదుదారుడికి చెందినది కాదని, సినిమా నిర్మాణ సంస్థకు చెందినది పోలీసులు స్పష్టం చేశారు.
రాజేంద్ర సోనీ మాట్లాడుతూ, “మేము ఈ విషయాన్ని పరిశోధించాము. వాహనం నంబర్ 4872 (ఫిర్యాదుదారు ఆరోపించినట్లు) కాదని కనుగొన్నాము. బైక్ అసలు నంబర్ 1872 కానీ బోల్ట్ కారణంగా నంబర్ లోని 1 సంఖ్య 4 లాగా కనిపించింది. ఆ నంబర్ ప్లేట్‌కు వారికి పూర్తి అనుమతి ఉంది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము గుర్తించాము అని అన్నారు.